న్యూఢిల్లీ, మార్చి: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(పీపీబీఎల్) 20 శాతం మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉన్నదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కొన్ని కీలక పీపీబీఎల్ ఆపరేషన్లను ఆర్బీఐ ఈ నెల 15 నుంచి సీజ్ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ కోతలు ఉండవచ్చని తెలుస్తున్నది. బ్యాంక్‌పై ఆర్బీఐ చర్యలు తీసుకొన్నప్పటి నుంచి పేటీఎం షేర్ల విలువ 50 శాతం వరకు పడిపోయాయి. అయితే వార్షిక పనితీరు మదింపును సాకుగా చూపి తక్కువ రేటింగ్స్ ఉన్న ఉద్యోగులను రాజీనామా చేయాలని కోరుతున్నారని పీబీఎల్‌కు చెందిన ఒక ఉద్యోగి చెప్పినట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని పేటీఎం అధికార ప్రతినిధి ఖండించారు.