పాట్నా, జూన్ 12: ఇది సినిమా హాల్ అనుకుంటున్నారా? అని ఓ జడ్జి బీహార్ ఐఏఎస్ అధికారిని నిలదీసిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. పాట్నా హైకోర్టు జడ్జికి, పట్టణ అభివృద్ధి, గృహనిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆనంద్ కిషోర్‌కు మధ్య జరిగిన సంభాషణ వీడియో క్లిప్ హల్చల్ చేస్తున్నది. ఓ కేసు విచారణ సందర్భంగా ఆనంద్ కిషోర్ ఓపెన్ కాలర్ వైట్ షర్ట్ ధరించి హాజరయ్యారు. దీంతో కోపగించుకున్న న్యాయమూర్తి ‘ఇది సినిమా హాల్ అనుకుంటున్నారా? కోర్టుకు ఎలా హాజరుకావాలో తెలియదా? ఐఏఎస్ శిక్షణలో నేర్చుకోలేదా? అని మందలించారు.