Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. రోగి మృతి, ఇద్దరికి గాయాలు
Oxygen Cylinder Explodes | ఒక రోగిని అంబులెన్స్‌లో మరో ఆసుపత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. అందులోని ఆక్సిజన్ సిలిండర్‌ను ఆన్ చేయగా అది పేలింది. దీంతో మంటలు ఎగసిపడ్డాయి. ఈ సంఘటనలో ఆ రోగి సజీవదహనం కాగా మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
భువనేశ్వర్: ఒక రోగిని అంబులెన్స్‌లో మరో ఆసుపత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. అందులోని ఆక్సిజన్ సిలిండర్‌ను ఆన్ చేయగా అది పేలింది. దీంతో మంటలు ఎగసిపడ్డాయి. ఈ సంఘటనలో ఆ రోగి సజీవదహనం కాగా మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. (Oxygen Cylinder Explodes) ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఉదాల మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక రోగిని మరో ఆసుపత్రికి డాక్టర్లు రిఫర్ చేశారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 8.45 గంటల సమయంలో ఆ రోగిని ప్రైవేట్ అంబులెన్స్‌లో తరలించేందుకు సిద్ధమయ్యారు.
కాగా, ఆ అంబులెన్స్‌లోని ఆక్సిజన్ సిలిండర్‌ను ఆన్ చేయగానే అది పేలింది. ఈ పేలుడు కారణంగా అంబులెన్స్‌లో మంటలు చెలరేగాయి. ఆ వాహనంలో ఉన్న రోగి మంటల్లో కాలి మరణించగా మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్లో కాలి మరణించిన రోగి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో అంబులెన్స్‌లో మంటలు వ్యాపించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ओडिशा के मयूरभंज स्थित उदाला अस्पताल परिसर में मरीज को शिफ्ट करने से पहले एंबुलेंस में भीषण आग लग गई। हादसे में मरीज की जान चली गई, जबकि दो अन्य लोग झुलसकर घायल हो गए। आग लगने के कारणों की जांच जारी है।
#Odisha #Mayurbhanj #AmbulanceFire #BreakingNews #PeoplesUpdate https://t.co/G2yGZIbanW
— People’s Update (@PeoplesUpdate) October 9, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- ablaze
- Dies
- Explodes
- Mayurbhanj
RELATED ARTICLES
తాజా వార్తలు
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. రోగి మృతి, ఇద్దరికి గాయాలు
SI Lingam | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు : ఎస్సై లింగం
Mental Health | మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 5 పోషక లోపాలు.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
‘బీసీ ఉద్యమ నేత గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి’
CJP protest | సీజేపీ నిరసన.. రాత్రి నుంచి సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

