‘Pee-Gate’ case | నిందితుడు శంకర్ మిశ్రాకు బెయిల్ మంజూరు
Pee-Gate case | ఫూటుగా మద్యం సేవించి ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోసిన కేసులో నిందితుడిగా ఉన్న శంకర్ మిశ్రాకు బెయిల్ మంజూరైంది. ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు ఇవాళ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
న్యూఢిల్లీ: ఫూటుగా మద్యం సేవించి ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోసిన కేసులో నిందితుడిగా ఉన్న శంకర్ మిశ్రాకు బెయిల్ మంజూరైంది. ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు ఇవాళ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దాంతో శంకర్ మిశ్రా జైలు నుంచి విడుదలు కాబోతున్నాడు.
కాగా, గత ఏడాది నవంబర్ 26న న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో శంకర్ మిశ్రా అనే ప్రయాణికుడు మద్యం మత్తులో తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోశాడు. ఈ ఘటనపై బాధితురాలు ఈ ఏడాది జనవరి 6న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు శంకర్ మిశ్రాను అరెస్ట్ చేశారు.
అనంతరం అతడిని పటియాలా హౌజ్ కోర్టులో హాజరుపర్చగా కోర్టు అతడికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కాగా, ఘటన జరిగిన వెంటనే బాధితురాలు తన దగ్గర డబ్బులు తీసుకుని రాజీ చేసుకుందని, ఇంకా డబ్బులు కావాలనడంతో తాను నిరాకరించానని, అందుకే నెల రోజుల తర్వాత కేసు పెట్టిందని నిందితుడు ఆరోపించాడు. ఆ తర్వాత నిందితురాలే అనారోగ్యం కారణంగా మూత్రం పోసుకుని తనపై కేసు పెట్టిందని మరో ఆరోపణ చేశాడు. వీటిపై కోర్టులో విచారణ జరుగుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

