Mumbai Monorail : ఎడతెరిపి లేని వర్షాలు.. కరెంట్ కోత కారణంగా నిలిచిపోయన ముంబై మోనోరైలు(Mumbai Monorail)లోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది నాలుగ్గంటల పాటు శ్రమించి రైలులో చిక్కుకున్న 582 మందిని కాపాడారు. రైలులో ప్రయాణిస్తున్న వారందరినీ క్షేమంగా బయటకు తీసుకొచ్చామని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
మంగళవారం సాయంత్రం 6:15 గంటల సమయంలో సాంకేతిక లోపం కారణంగా చెంబూర్ మైసూర్ కాలనీ – భక్తి పార్క్ మార్గం మధ్యంలో వెళ్తున్న మోనో రైలు బ్రేక్‌డౌన్ అయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రైలు మధ్యలోనే ఆగిపోయింది దాంతో.. అందులోని 582 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. భయభ్రాంతులకు లోనైన వారంతా ‘మమ్మల్ని కాపాడండి’ అంటూ తక్షణ సాయం కోసం ముంబై మున్సిపల్ కమిషన్ ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది భారీ క్రేన్ల సాయంతో వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దాంతో.. హమ్మయ్యా బతికిపోయాం అని ఊపిరిపీల్చుకున్నారు ప్రయాణికులు.
🚨 A monorail train is stuck on an elevated track at Mumbai’s Mysore Colony station due to a power supply failure. Over 150 passengers have been rescued and taken to hospital for medical attention. Rescue ops are still underway. #Mumbai #Monorail #BreakingNews pic.twitter.com/kgryHq4WSN
— Subodh Srivastava (@SuboSrivastava) August 19, 2025