న్యూఢిల్లీ: కదులుతున్న రైల్లోని ఏసీ బోగీలో ఒక ప్రయాణికుడు నూనె దీపాన్ని వెలిగించి మతపరమైన ఆచారాలు నిర్వహించడం నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. కంపార్ట్మెంట్ అంతటా పొగ వ్యాపించడంతో తోటి ప్రయాణికుడు ఒకరు ప్రమాదాల గురించి ఆ వ్యక్తికి వివరించడం కనిపించింది.
ఈ వివరాలను జార్ఖండ్ రైల్ యూజర్స్ అనే ఖాతా ఎక్స్‌లో పోస్ట్ చేసింది. రైల్లో పొగ ఫైర్ అలారంను ప్రేరేపించవచ్చు. మంట ఉండటం అగ్ని ప్రమాదానికి దారి తీస్తుంది అని క్యాప్షన్‌లో పేర్కొన్నారు.