న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి వీలైనంత త్వరగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని, ఇందుకోసం ఎన్నికల ప్రక్రియ వేగంగా జరుపాలని జీ 23 నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ‘జీ 23’ నేతలు గులాం నబీ ఆజాద్ ఇంట్లో సమావేశమయ్యారు. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన కాంగ్రెస్ నాయకత్వంపై వారు విమర్శలు గుప్పించారు. పార్టీని క్షేత్రస్థాయి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పార్టీ ఎంపీలు ఆనంద్ శర్మ, కపిల్ సిబల్, మనీశ్ తివారీ సమావేశమైన వారిలో ఉన్నారు. ఎన్నికల్లో పార్టీ పనితీరుపై సమీక్షించేందుకు సోనియా గాంధీ నేతృత్వంలో త్వరలో సీడబ్ల్యూసీ సమావేశం కానుండగా, జీ23 నేతలు సమావేశం కావడం గమ నార్హం.