ముంబై: ప్రభుత్వ ఆసుపత్రి భవనం స్లాబ్ నుంచి పెచ్చులు ఊడాయి. ఒక రోగి ఉన్న బెడ్‌పై అవి పడ్డాయి. అయితే ఆ రోగికి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ సమాచారం తెలుసుకున్న అధికారులు ఆ వార్డుకు చేరుకుని పరిశీలించారు. (hospital ceiling collapses) మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఈ సంఘన జరిగింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఒక వార్డులో స్లాబ్ పెచ్చులు ఊడాయి. ఒక రోగి బెడ్‌పై ఆ శిథిలాలు పడ్డాయి. అయితే తృటిలో ఆ రోగి తప్పించుకోవడంతో పెద్ద గాయాలు కాలేదు. వెంటనే ఆ రోగిని మరో బెడ్‌కు మార్చారు.
కాగా, ఇది చూసి ఆ వార్డులోని ఇతర రోగులు, వారి సహాయకులు, ఆసుపత్రి సిబ్బంది భయాందోళన చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారులు ఆ వార్డుకు చేరుకుని పరిశీలించారు. స్లాబ్‌లో చిన్న భాగం మాత్రమే కూలిందని, రోగికి ఎలాంటి తీవ్ర గాయాలు కాలేదని తెలిపారు. ఆ ప్రభుత్వ ఆసుపత్రి భవనం పాతదని చెప్పారు. దాని సామర్థ్యంపై తనిఖీ జరిగిందని, మరమ్మతు పనులు చేపడతామని వివరించారు.
మరోవైపు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆ ప్రభుత్వ ఆసుపత్రి బిల్డింగ్‌లోకి వర్షం నీరు చేరింది. దీంతో పలు వార్డులు జలమయం కావడంతో రోగులు, సిబ్బంది ఇబ్బందిపడ్డారు. తాజాగా స్లాబ్ పెచ్చులు ఊడిపడంతో ఆ ఆసుపత్రి భవనం పరిస్థితి, నిర్వహణ తీరును ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
🔴A section of the ceiling collapsed onto a patient’s bed at a district hospital in Amravati, Maharashtra India. Fortunately, the patient was unharmed. The incident has renewed concerns over the building’s deteriorating condition, and an investigation is underway. pic.twitter.com/NBUdq6TZFr
— International Relations (@Intl_Relations0) July 5, 2026