న్యూఢిల్లీ, మార్చి 8: పార్లమెంటు రెండోవిడత బడ్జెట్ సమావేశాలు ఈ నెల 14న ఉదయం 11 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి విడతలో ఉభయ సభలు కరోనా కారణంగా షిఫ్టు పద్ధతిలో పనిచేశాయి. అలాకాకుండా రెండో విడతలో ఎప్పటిలాగా సమాంతరంగా సమావేశమవుతాయి. లోక్సభ, రాజ్యసభ తమ చాంబర్స్లోనే పనిచేస్తాయి. కరోనా జాగ్రత్తల్లో భాగంగా దూరం పాటించేందుకు సభ్యుల సీటింగ్ కోసం అదనంగా గ్యాలరీలను కూడా వినియోగిస్తారు.