Parliament : ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నా పార్లమెంట్లో ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంది. విపక్ష ఎంపీల ఆందోళనల నడుమే రైల్వే సవరణ బిల్లు-2024కు లోక్సభ ఆమోదముద్ర వేయించుకుంది. ఈ ఏడాది ఆగస్టు 9న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా రైల్వే సవరణ బిల్లును రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లుకు ఇవాళ ఆమోద ముద్ర పడింది.
రైల్వే సవరణ బిల్లు చట్టంగా మారితే రైల్వేల ప్రైవేటీకరణకు దారితీస్తుందని విపక్ష పార్టీల ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే బిల్లుకు వ్యతిరేకంగా వారు సభలో నినాదాలు చేశారు. కానీ విపక్షాల నిరసనల నడుమే ప్రభుత్వం రైల్వే సవరణ బిల్లు లోక్సభ ఆమోదముద్ర వేయించుకుంది. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా ఈ బిల్లుతో రైల్వేల ప్రైవేటీకరణ జరగదని, రైల్వే బోర్డు పనితీరు మెరుగుపడుతుందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.