కేంద్ర మంత్రి రాణేపై చర్యలు తీసుకోండి
కేంద్ర మంత్రి నారాయణ్ రాణేతో పాటు ఆయన కుమారుడు, ఎమ్మెల్యే నితీశ్ రాణేపై సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ తల్లిదండ్రులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేశారు.
- మా కుమార్తె మృతిపై దుష్ప్రచారం చేస్తున్నారు
- రాష్ట్రపతికి దిశా సాలియన్ తల్లిదండ్రుల ఫిర్యాదు
ముంబై, మార్చి 25: కేంద్ర మంత్రి నారాయణ్ రాణేతో పాటు ఆయన కుమారుడు, ఎమ్మెల్యే నితీశ్ రాణేపై సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ తల్లిదండ్రులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేశారు. వీరిద్దరితో పాటు తమ కుమార్తె మృతిపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా కోరారు. తమ కుటుంబ పరువు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని, లేకుంటే ప్రాణాలు తీసుకోవడం తప్ప మరో మార్గం లేదని దిశా సాలియన్ తల్లిదండ్రులు సతీష్, వాసంతి పేర్కొన్నారు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు దిశ మేనేజర్‌గా పనిచేశారు. 2020, జూన్ 8న ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. రాజ్‌పుత్ కూడా అదే నెల 14న తన అపార్ట్మెంట్లో శవమై కనిపించాడు. ఈ రెండు ఘటనలను కనెక్ట్ చేస్తూ కొందరు సోషల్ మీడియా ద్వారా తప్పుడు, ఊహాజనిత వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్యతో ఉన్న రాజకీయ శత్రుత్వంతో కేంద్ర మంత్రి నారాయణ్ రాణే, నితీశ్‌లు కూడా ప్రెస్మీట్లతో అదే ప్రచారం చేస్తున్నారని వారు లేఖలో తెలిపారు. నారాయణ్ రాణే, ఆయన కుమారుడిపై ముంబై పోలీసులు ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ నెల మొదట్లో పోలీసులు మంత్రిని ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Disha Salian
- Narayan Rane
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

