లక్నో: ప్రియురాలితో కలిసి ఉన్న కొడుకును అతడి తల్లిదండ్రులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. స్కూటర్‌పై పారిపోయేందుకు ప్రయత్నించిన వారిని అడ్డుకున్నారు. కుమారుడితోపాటు అతడి ప్రియురాలిని కొట్టారు. (Parents Catch and Thrash Son, Girlfriend) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం 21 ఏళ్ల రోహిత్, 19 ఏళ్ల ప్రియురాలు కలిసి ఫుడ్ స్టాల్ వద్ద చౌమీన్ తిన్నారు. ఇంతలో రోహిత్ తల్లిదండ్రులు సుశీల, శివకరణ్ అక్కడకు చేరుకున్నారు. ప్రియురాలితో కలిసి ఉన్న కుమారుడ్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
కాగా, ప్రియురాలితో కలిసి స్కూటర్‌పై అక్కడి నుంచి పారిపోయేందుకు రోహిత్ ప్రయత్నించాడు. అయితే తల్లిదండ్రులు అతడి స్కూటర్‌ను అడ్డుకున్నారు. కుమారుడ్ని, అతడి ప్రియురాలిని నిలదీయడంతోపాటు చెప్పుతో కొట్టారు. వారిద్దరి జుట్టుపట్టుకుని తన్నారు. అక్కడ గుమిగూడిన జనం జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించినా వారిద్దరిని కొట్టడం ఆపలేదు.
మరోవైపు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. రోహిత్, అతడి ప్రియురాలిని కొడుతున్న తల్లిదండ్రులను విడదీశారు. అనంతరం ఇరు వర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే కొడుకును, అతడి ప్రియురాలిని తల్లిదండ్రులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కొట్టిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#कानपुर मां ने बेटे और बेटे की प्रेमिका को साथ पकड़ा बीच सड़क कर दी पिटाई..
लड़के की मां ने बेटे की प्रेमिका को बीच सड़क जमकर पीटा,बीचब चाव कर थे बेटे की भी हुई पिटाई, गुजैनी थाना क्षेत्र के राम गोपाल चौराहे की घटना ।#kanpur #news #sirfsuch pic.twitter.com/Rh9vopObhz
— ठाkur Ankit Singh (@liveankitknp) May 2, 2025