ముంబై: పేషెంట్ల రిపోర్ట్స్‌తో పేపర్ ప్లేట్స్ తయారు చేశారు. (Paper Plates Made Of Patient Reports) దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ హాస్పిటల్‌కు చెందిన ఆరుగురు సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (కేఈఎం) ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన రోగులకు సంబంధించిన రిపోర్టుల కాగితాలతో పేపర్ పేట్లు తయారు చేశారు. ఈ పేపర్ పేట్లకు సంబంధించిన వీడియో క్లిప్‌ను మాజీ మేయర్ కిషోరి పెడ్నేకర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రభుత్వ ఆసుప్రతి తీరుపై మండిపడ్డారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కేఈఎం డీన్ డాక్టర్ సంగీతా రావత్ స్పందించారు. ఆ పేపర్ పేట్లు పేషెంట్ల రిపోర్టులతో తయారు చేసినవి కావని తెలిపారు. సీటీ స్కాన్‌కు సంబంధించిన పాత రిపోర్ట్స్ అని చెప్పారు. వాటిని చించివేయకుండా స్క్రాప్ డీలర్‌కు ఇవ్వడం పొరపాటని అన్నారు. బాధ్యులైన ఆరుగురు హాస్పిటల్ సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.
हे काय चाललंय ??
प्रशासन जागे व्हा…!
एवढा अंधाधुनी कारभार करू नका @mybmc @mybmcHealthDept pic.twitter.com/6gUw6BSSGA— Kishori Pednekar (@KishoriPednekar) July 5, 2024