న్యూఢిల్లీ: వివాదాస్పద చర్యలతో వార్తల్లో నిలిచిన ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్‌పై విచారణకు కేంద్రం ఒక ప్యానల్‌ను ఏర్పాటు చేసింది. తన శారీరక అంగ వైకల్య క్యాటగిరీ, ఓబీసీ కోటాను దుర్వినియోగం చేసి ఐఏఎస్ సర్వీస్ సాధించినట్టు పూజాపై వచ్చిన ఆరోపణలపై కమిటీ విచారణ చేస్తుంది.
వివాదాస్పద ప్రవర్తన కారణంగా బదిలీ అయిన ఖేద్కర్ గురువారం వాసిం జిల్లా కలెక్టరేట్లో అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. కాగా, ట్రైనీ కలెక్టర్‌గా ఉండగానే తనకు ప్రత్యేక ఛాంబర్ కావాలనడం, తన ప్రైవేట్ ఆడీ కారుకు సైరన్, ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నెంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వాడినట్టు ఆరోపణలు రావడంతో పుణె నుంచి ఆమెను బదిలీ చేశారు.