న్యూఢిల్లీ, ఆగస్టు 19: గోవాకు చెందిన ప్రముఖ గనుల వ్యాపారి కుమారుడికి చెందిన రూ.36 కోట్ల విలువజేసే ఆస్తుల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం సీజ్ చేసింది ‘పండోరా పేపర్స్ లీక్’కు సంబంధించిన కేసులో గోవా గనుల వ్యాపారి రాధా టింబ్లో కుమారుడు రోహన్ టింబ్లోపై ఈడీ ఫెమా చట్టం కింద కేసులు నమోదుచేసింది.
‘రోహన్ టింబ్లోకు విదేశాల్లో మూడు ఆఫ్షోర్ (నకిలీ) కంపెనీలు ఉన్నాయని మా విచారణలో తేలింది’ అని ఈడీ తెలిపింది. ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇంటర్నేషనల్ జర్నలిస్టు’ (ఐసీఐజే) పరిశోధనాత్మక జర్నలిజం ద్వారా 2021లో ‘పండోరా పేపర్స్’ను విడుదల చేసింది. విదేశాల్లో నల్లధనాన్ని దాచిపెట్టిన వందలాది మంది భారతీయుల పేర్లను బయటపెట్టింది.