జెరూసలెం: పాలస్తీనా ప్రధాని మహమ్మద్ శతాయే సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. అమెరికా మద్దతుతో పాలస్తీనియన్ అథారిటీలో సంస్కరణలు జరగడానికి వీలుగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఆయన, ఆయన ప్రభుత్వం రాజీనామాలను ఆమోదించడంపై ప్రెసిడెంట్ మహమౌద్ అబ్బాస్ ఓ నిర్ణయం తీసుకోవలసి ఉంది. శతాయే రాజీనామాతో పాలస్తీనియన్ అథారిటీని బలోపేతం చేయడానికి అవసరమైన సంస్కరణలకు పాలస్తీనియన్ నేతలు అంగీకరిస్తున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి.