లుథియానా : వీధి వ్యాపారులు(Street Vendor) ఒక్కొక్కరు ఒక్కో స్టయిల్లో ఫుడ్ తయారీ చేస్తుంటారు. అయితే లూథియానాలో ఉన్న ఓ స్టాల్ ఓనర్ పకోడీలు చేస్తున్న తీరు కొంత ఆందోళన కలిగిస్తున్నది. కడాయిలో వేడిగా కాగుతున్న నూనెలో.. మరింత నూనె పోసేందుకు చాలా అభ్యంతరకరమైన విధానాన్ని వాడుతున్నాడతను. ఓ చేతిలో అయిదు ఆయిల్ ప్యాకెట్లను పట్టుకుని.. వాటిల్లో ఉన్న నూనెను కడాయిలో పోసేందుకు కట్ చేయకుండానే.. కాగుతున్న నూనెలో ముంచుతున్నాడు. ఆ నూనె వేడికి ఆయిల్ ప్యాకెట్లలో ఉన్న పచ్చి నూనె కడాయిలో పడిపోతోంది. ఇక ఆ తర్వాత ఆ నూనెతోనే బ్రెడ్ పకోడీలు తయారు చేస్తున్నాడు ఆ వీధి వ్యాపారి.
ఇదంతా ఓ బ్లాగర్ తన వీడియోలో చిత్రీకరించాడు. ఆ వ్యాపారి మాత్రం తన చర్యను సమర్థించుకున్నాడు. కాగుతున్న నూనెలో ఆయిల్ ప్యాకెట్లను ముంచడం పట్ల ఆన్లైన్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆహార నిపుణులు ఈ విధానాన్ని తప్పుపడుతున్నారు. ఆయిల్ ప్యాకెట్లను ముంచిన నూనెలో వండిన వంటకాలు తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని అంటున్నారు. వేడి నూనెలో ప్లాస్టిక్ కలుస్తుందని గ్రహించకుండానే జనం ఆ పకోడీలను తినేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ, స్థానికలు ఆ వ్యాపారిపై చర్యలు తీసుకోవాలన్నారు. స్ట్రీట్ ఫుడ్ విషయంలో జాగ్రత్త పాటించాల్సి ఉంటుందని కొందరన్నారు.
You don’t need to be a doctor to know what he is doing is extremely toxic for health. One look and it’s obvious.
Still, the facts: dipping plastic pouches in boiling oil causes them to break down and release toxic chemicals like dioxins, phthalates, BPA, and styrene. These leach… pic.twitter.com/o8zgyw5fCR
— THE SKIN DOCTOR (@theskindoctor13) August 6, 2025