న్యూఢిల్లీ: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నడుమ పాకిస్థానీ నటి హానియా ఆమిర్‌కు ఇండియన్ ఫ్యాన్స్ వాటర్ బాటిళ్లను పంపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది. ఈ వీడియోలో కొందరు యువకులు కొన్ని వాటర్ బాటిళ్లను ఓ పెట్టెలో ఉంచి ప్యాకింగ్ చేస్తున్నట్లు కనిపించింది.
ఆ పెట్టె పైన ‘టు హానియా ఆమిర్, రావల్పిండి, పంజాబ్, పాకిస్థాన్. ఫ్రమ్ ఇండియా’ అని రాసి ఉంది. పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం పాకిస్థాన్‌పై చర్యల్లో భాగంగా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం సస్పెండ్ చేసింది. భారత్ నుంచి వెళ్లే జలాలు పాక్‌లోని 80 శాతం సాగు భూములకు ఆధారం.