న్యూఢిల్లీ, ఆగస్టు 6: సీమాహైదర్ ఘటన వెలుగులోకి వచ్చాక సరిహద్దులు దాటి పెండ్లి చేసుకుంటున్న సంఘటనలు నిత్యకృత్యంగా మారాయి. ఇటీవల ఇండియాకు చెందిన అంజూ పాక్ ప్రేమికుడిని పెండ్లాడగా, శ్రీలంకు చెందిన విఘ్నేశ్వరి చిత్తూరు యువకుడిని పెండ్లి చేసుకుంది. తాజాగా మరో సరిహద్దు పెండ్లి ఘటన వెలుగులోకి వచ్చింది.
అయితే ఇది పెద్దలు కుదిర్చిన వివాహం కావడం గమనార్హం. రాజస్థాన్లోని జోధ్పూర్కు చెందిన అర్బాజ్ ఖాన్కు కరాచీకి చెందిన అమీనాకు పెండ్లి కుదిరింది. అయితే వధువుకు భారత వీసా లభించలేదు. దీంతో ఇరు కుటుంబాల అంగీకారంతో వర్చువల్గా వివాహం జరిపించారు. హంగు ఆర్భాటాలతో సంప్రదాయం ప్రకారం పెండ్లి తంతును ముగించారు.