న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ మరోసారి ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూపై విమర్శలు చేశారు. సిద్ధూకు పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనకు ఒక సందేశం పంపాడని, సిద్ధూను మంత్రివర్గంలోకి తీసుకొమ్మన్నది ఆ సందేశం సారాంశమని అమరీందర్ చెప్పారు.
‘పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నాకు ఓ రిక్వెస్ట్ పంపించాడు. నవజ్యోత్ సింగ్ సిద్ధూను మంత్రివర్గంలోకి తీసుకోవాలని కోరాడు. అలా తీసుకుంటే తాను సంతోషిస్తానని, సిద్ధూ తనకు పాత మిత్రుడని పేర్కొన్నాడు. ఒకవేళ సిద్ధూ సరిగా పనిచేయకపోతే మంత్రివర్గం నుంచి తొలగించవచ్చని ఇమ్రాన్ సలహా ఇచ్చాడు’ అని అమరీందర్‌సింగ్ వెల్లడించారు.
#WATCH | Pakistan PM had sent a request if you can take (Congress Punjab president Navjot Singh) Sidhu into your Cabinet I will be grateful, he is an old friend of mine. You can remove him if he'll not work: Punjab Lok Congress president & former Punjab CM Amarinder Singh pic.twitter.com/88jSfIpfQ8
— ANI (@ANI) January 24, 2022
కాగా, నవజ్యోత్‌సింగ్ సిద్ధూతో వివాదం కారణంగానే అమరీందర్‌సింగ్ తన ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆయన సిద్ధూకు పాకిస్థాన్‌తో సంబంధాలున్నాయని ఆరోపిస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ ప్రధానికి సిద్ధూ ఆప్తుడు అంటూ మరో సందర్భాన్ని అమరీందర్ బయటపెట్టారు.