న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రేపటి నుంచి నో మనీ ఫర్ టెర్రర్ అంశంపై అంతర్జాతీయ సదస్సు జరగనున్నది. మూడవ దఫా సదస్సులో 78 దేశాలతో పాటు అనేక బహుళజాతి సంస్థలు పాల్గొంటున్నట్లు ఎన్ఐఏ డైరక్టర్ జనరల్ దినకర్ గుప్తా తెలిపారు.నో మనీ ఫర్ టెర్రర్ కాన్ఫరెన్స్‌లో పాకిస్థాన్ పాల్గొనడం లేదన్నారు. హవాలా లావాదేవీలకు చెందిన సంప్రదాయ పద్ధతులు, ఉగ్రవాదులకు ఫైనాన్సింగ్ అంశాలను సదస్సులో చర్చించనున్నట్లు దినకర్ వెల్లడించారు. 20 దేశాలకు చెందిన మంత్రులు కూడా ఈ సమావేశాలకు హాజరుఅవుతున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలు చాలా వరకు తగ్గాయని, కానీ విధ్వంసకర తీవ్రవాదంపై పోరాటాన్ని కొనసాగించాలని దినకర్ గుప్తా తెలిపారు. ఉగ్రవాదులు సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతున్నారని, ఈ అంశాన్ని చర్చించాల్సి ఉందని ఆయన చెప్పారు. నో మనీ ఫర్ టెర్రర్ కాన్ఫరెన్స్‌కు చైనాను ఆహ్వానించినట్లు కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి సంజయ్ వర్మ తెలిపారు.