న్యూఢిల్లీ: రాష్ట్రీయ లోకతాంత్రిక్ పార్టీ ఎంపీ హనుమాన్ బెనివాల్(MP Hanuman Beniwal) లోక్‌సభలో నవ్వులు పూయించారు. వాడివేడిగా ఆపరేషన్ సింధూర్‌పై చర్చ జరుగుతున్న సమయంలో ఆయన తన సెటైర్లతో ఆకట్టుకున్నారు. సోమవారం రాత్రి ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియాకు పాకిస్థాన్ భార్య అయ్యిందని, ప్రభుత్వం ఆమెను ఇంటికి తీసుకురావాలని ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు. సిందూర్ అని ఎందుకు పేరు పెట్టారో తెలియదు, కానీ, పాకిస్థాన్‌కు ఇండియా సిందూరం పెట్టినట్లుగా ఉందని, హిందువుల నమ్మకం ప్రకారం భారతీయ మహిళలు తన భర్తను సిందూరంగా భావిస్తారని, పాకిస్థాన్‌కు భారత్ సిందూరం పెట్టిందని, అందుకే ఇండియాకు పాకిస్థాన్ భార్యగా మారిందని, ఇప్పుడు కేవలం వధువు అప్పగింతలు మాత్రమే మిగిలి ఉన్నట్లు ఎంపీ బెనివాల్ పంచ్ వేశారు. వెళ్లి పాకిస్థాన్‌కు ఇంటికి తీసుకురావాలని ఆయన డైలాగ్ విసిరారు. దీంతో సభలో నవ్వులు పూశాయి.
ఆయన దగ్గర కూర్చున్న ఎంపీలు కూడా నవ్వును ఆపుకోలేకపోయారు. చాలా సీరియస్‌గా డిస్కషన్ జరుగుతున్న సమయంలో ఎంపీ బెనివాల్ వేసిన సెటైర్‌తో అన్ని పార్టీల సభ్యులు కాసేపు నవ్వుకున్నారు. ఓ దశలో తొందరగా ప్రసంగాన్ని ముగించుకోవాలని ఓ ఎంపీ అరవడంతో.. ఆయన వైపు చూస్తూ మీరు అరగంట మాట్లాడారు, నన్ను అప్పుడే ముగించేయమంటారా అని అన్నారు. అదే సమయంలో ప్యానల్ స్పీకర్ బజర్ బెల్ కొట్టడంతో మళ్లీ పంచ్ విసిరారు. అయిపోయిందా అంటూ వ్యంగ్యంగా రియాక్ట్ అయ్యారు. దీంతో మళ్లీ ఎంపీలు అందరూ నవ్వుకున్నారు.
వాస్తవానికి రాత్రి పదిన్నర సమయంలో ఆయన మాట్లాడారు. కానీ ఇప్పుడు ఉదయం పదిన్నర అయ్యిందని, తన వ్యాఖ్యలు ఏవీ న్యూస్పేపర్లలో రావు అని, కేవలం సోషల్ మీడియాలో మాత్రమే మ్యానేజ్ చేసుకోవాల్సి వస్తుందని అన్నారు. దీంతో మరోసారి సభలో ఉన్న ఎంపీలు నవ్వుకున్నారు. సింధూర్ అని ఎందుకు పేరు పెట్టారో ప్రధాని చెప్పాలని ఆయన కోరారు. అగ్నివీర్ పథకంతో సైనికుల్లో మనోధైర్యం సన్నగిల్లిందన్నారు.
ऑपरेशन सिंदूर पर लोक सभा में हुई विशेष चर्चा में भाग लेते हुए कई महत्वपूर्ण बिंदुओं पर सरकार से सवाल किए |#OperationSindoorDebate pic.twitter.com/cXqY4NCnL7
— HANUMAN BENIWAL (@hanumanbeniwal) July 29, 2025