Amit Shah: పాకిస్థాన్ సరెండర్ అయ్యింది: అమిత్ షా
Amit Shah: అన్ని ఆయుధాలు కోల్పోయిన తర్వాత, గత్యంతరం లేని పరిస్థితుల్లో పాకిస్థాన్ సరెండర్ అయినట్లు కేంద్రమంత్రి అమిత్ షా తెలిపారు. మే 10వ తేదీన పాకిస్థాన్ డీజీఎంవో.. దాడుల్ని ఆపేస్తున్నట్లు సాయంత్రం 5 గంటలకు ఫోన్ చేశారన్నారు. లోక్‌సభలో జరుగుతున్న ఆపరేషన్ సింధూర్ చర్చ సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ : ఆపరేషన్ సింధూర్‌పై ఇవాళ లోక్‌సభలో చర్చ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న సమయంలో.. పాకిస్థాన్ లొంగిపోయినట్లు ఆయన తెలిపారు. ఆ పరిస్థితికి దారితీసిన ఘటనలను ఆయన సభలో పేర్కొన్నారు. పెహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించారని, దాంట్లో 25 మంది భారతీయులు, ఓ నేపాలీ ఉన్నారన్నారు. ఏప్రిల్ 30వ తేదీన సీసీఎస్ మీటింగ్‌లో సింధూ నదీ జలాలపై నిర్ణయం తీసుకున్నామన్నారు. పాకిస్థానీ పౌరుల్ని వెనక్కి పంపామన్నారు. సీఆర్పీఎఫ్, ఆర్మీ, జేకే పోలీసులు ఉగ్రవాదులకు గట్టి బదులు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.
మే 9వ తేదీన పాకిస్థాన్‌పై దాడి కోసం ఆర్మీకి ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి షా చెప్పారు. 11 ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేశామన్నారు. నూర్ ఖాన్ ఛక్లా, మురిద్, సుగుర్దా, రఫికీ, రహిమ్ ఖాన్, జాకోబాబాద్, భోలారిని ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఆరు రేడార్లను, సర్ఫేస్ టు ఎయిర్ ఆయుధాలను ధ్వంసం చేశామన్నారు. ఎయిర్ బేస్‌లను టార్గెట్ చేయలేదని, కానీ భారత్‌లో ఉన్న పౌర ప్రాంతాలను పాకిస్థాన్ అటాక్ చేసే ప్రయత్నం చేసిందన్నారు. పాకిస్థాన్ తన దాడులకు చెందిన అన్ని రకాల సామర్థ్యాలను కోల్పోవడంతో, ఆ దశలో ఆ దేశానికి మరో అవకాశం లేకుండా పోయిందని, అప్పుడు పాకిస్థాన్ లొంగిపోయినట్లు అమిత్ షా తెలిపారు.
మే 10వ తేదీన పాకిస్థాన్ డీజీఎంవో.. దాడుల్ని ఆపేస్తున్నట్లు సాయంత్రం 5 గంటలకు ఫోన్ చేశారన్నారు. అయితే అడ్వాంటేజ్ ఉన్న సమయంలో ఎందుకు అటాక్ చేయలేదని ప్రశ్నిస్తున్నారని, కానీ ప్రతి యుద్ధానికి ఓ సామాజిక కోణం ఉంటుందని మంత్రి అన్నారు. 1951, 1971లో జరిగిన యుద్ధాల గురించి ఆయన వెల్లడించారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ను నెహ్రూ అప్పగించారని, షిమ్లా ఒప్పందంలో దాన్ని డిమాండ్ చేయలేదన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

