20 మంది భారత జాలర్లను విడుదల చేసిన పాక్
Fishermen | తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన 20 మంది భారత మత్స్యకారులను పాకిస్థాన్ విడుదల చేసింది. కరాచీలోని లాధీ జైలులో నాలుగేండ్ల శిక్ష ముగించుకున్న వారు.. వాఘా సరిహద్దు

న్యూఢిల్లీ: తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన 20 మంది భారత మత్స్యకారులను పాకిస్థాన్ విడుదల చేసింది. కరాచీలోని లాధీ జైలులో నాలుగేండ్ల శిక్ష ముగించుకున్న వారు.. వాఘా సరిహద్దు ద్వారా స్వదేశంలోకి సోమవారం ప్రవేశించారు. 2017లో భారత్‌కు చెందని జాలర్లు పొరపాటున పాక్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారు. దీంతో వారిని అరెస్టుచేసి నాలుగేండ్ల పాటు జైలు శిక్ష విధించారు.

దీంతో కరాచీలోని లోధీ జైలులో శిక్ష ముగించుకుని ఆదివారం విడుదలయ్యారని పాక్‌కు సామాజిక సంక్షేమ సంస్థ.. ఈధి ఫౌండేషన్ తెలిపింది. లీగల్ ఫార్మాలిటీస్ ముగిశాక జాలర్లను సోమవారం సాయంత్రం వాఘా సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ అధికారులకు అప్పగించినట్లు వెల్లడించింది.
ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం జార్లకు ‘ఎమర్జెన్సీ ట్రావెల్ సర్టిఫికేట్’ ఇచ్చిందని, దాంతో వారు భారత్‌లోకి ప్రవేశించారని తెలిపింది. అనంతరం వారికి కరోనా సహా ఇతర వైద్య పరీక్షలు నిర్వహించినట్లు భారత అధికారులు స్పష్టం చేశారు. నేడు గుజరాత్‌లోని వారి స్వస్థలాలకు చేరుకుంటారని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

