Abdul Basit : పశ్చిమాసియా యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతున్న వేళ పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బసిత్ (Abdul Basit) రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అమెరికా తమ దేశంపై దాడికి పాల్పడితే.. తాము భారత్‌లోని ఢిల్లీ, ముంబై నగరాలపై బాంబులు వేస్తామని బసిత్ వివాదానికి తెర తీశారు. అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ (Tulsi Gabbard) వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఆయన భారత్‌పై విషంగక్కారు. కిస్థాన్ తమ దీర్ఘ శ్రేణి క్షిపణులతో అమెరికాలో విధ్వంసం సృష్టించగలదు అని తులసీ పేర్కొనడంపై స్పందించిన బసిత్ తమ ఆయుధ సంపత్తి గురించి మాట్లాడారు.
అమెరికా ఇంటెలిజెన్స్ కమిటీ హౌస్‌కు 2026లో ముప్పు విశ్లేషణకు సంబంధించిన నివేదికను తులసీ గబ్బార్డ్ సమర్పించారు. ఈ నివేదికలో ఆమె పాకిస్థాన్ నుంచి ముప్పు పొంచి ఉందని తెలిపారు. పాకిస్థాన్ క్షిపణులు తమ ప్రాంతంపై దాడి చేయగలవు అని ఆమె పేర్కొనడంపై అబ్దుల్ బసితో స్పందిస్తూ.. భారతీయులరాలైన తులసీ గబ్బార్డ్ పాకిస్థాన్‌పై వ్యతిరేకత వెలిబుచ్చడంలో ఆశ్చర్యమే లేదని అన్నారు. ‘ఆమె భారతీయురాలు. పాకిస్థాన్ చేప్టటే నియంత్రణ చర్యలన్నీ భారత్‌కే వర్తిస్తాయి.
#BREAKING: Pakistan’s most radical Islamist Diplomat Abdul Basit threatens United States amid West Asia crisis. Basit former Pak High Commissioner to India says if US attacks Pakistan, Rawalpindi’s Asim Munir will attack Mumbai & New Delhi if Pak missiles don’t reach Middle East. pic.twitter.com/j4OxSg0ZnY
— Aditya Raj Kaul (@AdityaRajKaul) March 22, 2026
ఆమె మా క్షిపణులను చూశారు. కానీ, భారత్‌కు అగ్ని 5, అగ్ని 6 వంటి ఖండాంతర క్షిపణులు ఉన్నాయి. వాటిలా సుదూరు లక్ష్యాలను ఛేదించే మిస్సైల్స్ మాకు లేవు. మేము కనీసం ఇజ్రాయేల్‌ను అయినా టార్గెట్ చేస్తాం’ అని పాకిస్థాక్కు చెందిన ఏబీఎన్ న్యూస్‌లో బసిత్ వెల్లడించారు. అంతేకాదు.. పాకిస్థాన్ క్షిపణుల సామర్ధ్యం గురించి మాట్లాడేటప్పుడు భారత దేశం ప్రస్తావనను అమెరికా తీసుకు రాదని తాను భావించానని బసిత్ అన్నారు.
ఇరాన్‌పై యుద్ధానికి దిగిన ఇజ్రాయేల్, అమెరికాలు పాకిస్థాన్‌లోని అణు ఇంధన కేంద్రాలపై దాడి చేసే అవకాశముందని బసిత్ అన్నారు. ‘ఇరాన్లో పరిస్థితులు అనుకూలించకుంటే ఇజ్రాయేల్ కన్ను అమెరికాపై పడుతుంది. అప్పుడు అమెరికా మా దేశంలోని అణు ఇంధన స్థావరాలను లక్ష్యం చేసుకునే అవకాశముంది. ఇది అసాధ్యమే. కానీ ఒకవేళ ఆ పరిస్థితి వస్తే అమెరికా ఆలోచించదు. అమెరికా మా అణు ఇంధనాల పరిధిలో లేదు. అప్పుడు మేము భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటాం. ఒకవేళ అమెరికా మాపై దాడులు చేస్తే మేము భారత్‌పై దాడి చేసేందుకు ఏమాత్రం ఆలోచించం. ఆ దేశంలోని ముంబై, ఢిల్లీలో విధ్వంసం సృష్టిస్టాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో అప్పుడు చూసుకుంటాం’ అని అని అబ్దుల్ బసిత్ పాక్‌పై ఎవరు కన్నేసిన తమ టార్గెట్ మాత్రం ఇండియానే అని పేర్కొన్నారు.
BREAKING 🚨
🇺🇸🇮🇱🇮🇷 🇮🇳 During a serious discussion on the US–Israel–Iran war, Pakistan’s senior defence strategist Abdul Basit said:
☢️“If America attacks Pakistan, we will nuke India.”
🚀 Our missiles can’t reach the U.S, So Indian cities like Delhi & Mumbai become targets. pic.twitter.com/TQNnKQSeut
— FalconUpdatesHQ (@FalconUpdatesHQ) March 21, 2026
అమెరికాతో సంబంధాల గురించి కూడా ప్రస ప్రస్తావించిన ఆయన.. అమెరికా వ్యూహాత్మక భాగస్వామి భారతదేశం. పాకిస్థాన్‌కు కూడా అమెరికాతో మంచి సంబంధాలే ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఇరుదేశాల మధ్య కొన్ని అంశాలు మెరుగుపడ్డాయి. అయితే.. దీర్ఘ కాలంలో ఆ దేశం మాకు వ్యూహాత్మక భాగస్వామి కాదని గుర్తంచుకోవాలి. చైనా – పాకిస్థాన్ తరహాలో భారత్ – అమెరికా వ్యూహాత్మక భాగస్వాములు అని వివరించారు.