306 మిలియన్ యూనిట్లు.. రాష్ట్రంలో బెంబేలెత్తిస్తున్న విద్యుత్తు వినియోగం
తెలంగాణలో విద్యుత్తు సంస్థలకు ఎల్‌నినో సవాలు విసురుతున్నది. ఉష్ణోగ్రతల పెరుగుదల, లోటు వర్షపాతంతో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ మోత మోగుతున్నది. రాష్ట్రంలో ఈ నెల 5న 212 మిలియన్ యూనిట్లుగా ఉన్న విద్యుత్తు వినియోగం ఈ నెల 14 నాటికి 306 మిలియన్ యూనిట్లు దాటింది. దీంతో కేవలం 10 రోజుల వ్యవధిలోనే విద్యుత్తు వినియోగం ఏకంగా 94 మిలియన్ యూనిట్లు పెరిగింది.
- 10 రోజుల్లోనే 94 మిలియన్ యూనిట్ల పెరుగుదల
- పీక్ డిమాండ్ 16,270 మెగావాట్లకు చేరిక
- మండుతున్న ఎండలు, వేడి గాలులే కారణం
- విద్యుత్తు సంస్థలకు సవాలు విసురుతున్న ఎల్‌నినో
హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో విద్యుత్తు సంస్థలకు ఎల్‌నినో సవాలు విసురుతున్నది. ఉష్ణోగ్రతల పెరుగుదల, లోటు వర్షపాతంతో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ మోత మోగుతున్నది. రాష్ట్రంలో ఈ నెల 5న 212 మిలియన్ యూనిట్లుగా ఉన్న విద్యుత్తు వినియోగం ఈ నెల 14 నాటికి 306 మిలియన్ యూనిట్లు దాటింది. దీంతో కేవలం 10 రోజుల వ్యవధిలోనే విద్యుత్తు వినియోగం ఏకంగా 94 మిలియన్ యూనిట్లు పెరిగింది. పీక్ డిమాండ్ 11,395 నుంచి 16,270 మెగావాట్లకు చేరింది. ప్రతిరోజూ వినియోగం పెరుగుతుండటంతో విద్యుత్తు సంస్థల అధికారుల్లో కలవరం మొదలయ్యింది. ప్రస్తుత వానకాలంలో ఇప్పటివరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసిన దాఖలాల్లేవు. వేడిగాలులు, ఎండలు మండిపోతున్నాయి. వర్షాలు మరింత ఆలస్యమైతే రైతులు భూగర్భ జలాలపైనే ఆధారపడతారు. దీంతో బోర్లు, బావుల్లోని మోటర్లను ఎక్కువ సేపు నడపాల్సి ఉంటుంది. తద్వారా వ్యవసాయ విద్యుత్తు వినియోగం పెరిగి మొత్తం రాష్ట్ర విద్యుత్తు అవసరాలపై అదనపు భారం పడే అవకాశం ఉన్నది.
డిస్కమ్‌లకు పరీక్ష
డిమాండ్, వినియోగం పెరుగుతుండటంతో విద్యుత్తు సంస్థల అంచనాలు తప్పాయి. సాధారణంగా ఏటా మార్చిలో పీక్ డిమాండ్, అత్యధిక విద్యుత్తు వినియోగం నమోదవుతుంది. కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ సారి జూలై, ఆగస్టు నెలల్లో విద్యుత్తు డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షాలు పకడకపోతే వినియోగం, పీక్ డిమాండ్ పెరిగి విద్యుత్తు వ్యవస్థ అతులాకుతలమవుతాయి. పీక్ డిమాండ్‌ను తట్టుకోవాలంటే అవసరాలకు తగ్గట్టు డిస్కమ్‌లు విద్యుత్తు కొనుగోళ్లను పెంచుకోవాల్సి ఉంటుంది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

