పనాజీ: నాసిక్‌లో ఆక్సిజన్ లీకేజీ దుర్ఘటనను మరిచిపోకముందే తాజాగా గోవాలో అలాంటి ఘటనే చోటుచేసుకున్నది. దక్షిణ గోవాలోని జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ లీకై దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అధికారులు లీకేజీని అరికట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు అగ్నిప్రమాదం జరిగితే మంటలను ఆర్పడం కోసం అక్కడ ఫైరింజన్లను సిద్ధంగా ఉంచారు.
కాగా, సాధ్యమైనంత త్వరగా లీకేజీని కంట్రోల్ చేయకపోతే ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉన్న రోగులకు ప్రాణాపాయం తప్పదని వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా, గత నెల 21న కూడా మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలోగల జాకీర్ హుస్సేన్ ఆస్పత్రిలో ఆక్సిజన్ లీకై 22 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు.
#WATCH Oxygen tank leakage at South Goa District Hospital; fire tenders rushed to the spot. Details awaited#Goa pic.twitter.com/QmDN6JlZ0J
— ANI (@ANI) May 11, 2021