అటల్ టన్నెల్లో ఓవర్టేక్ చేయబోయి టూరిస్ట్ కారు బీభత్సం.. వీడియో
Atal tunnel car accident: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం రోహ్తంగ్ జిల్లాలోని అటల్ టన్నెల్లో ఓ కారు అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్తున్న టూరిస్ట్ కారు డ్రైవర్.. ముందువెళ్తున్న కారును

మనాలి: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం రోహ్తంగ్ జిల్లాలోని అటల్ టన్నెల్లో ఓ కారు అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్తున్న టూరిస్ట్ కారు డ్రైవర్.. ముందువెళ్తున్న కారును ఓవర్ టేక్ చేసేందుకు ఎదురుగా వాహనాలు వచ్చే లైన్లోకి వెళ్లాడు. అయితే ఆ లైన్లో వాహనం వస్తున్నది గమనించి స్టీరింగ్‌ను ఎడమవైపునకు లాగి ఎడమ వైపున ఉన్న గోడను ఢీకొట్టాడు. అయినా కంట్రోల్ కాని కారు అదేవేగంతో వచ్చి కుడివైపు గోడను ఢీకొట్టి ఆగిపోయింది.
ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కానీ ఆ కారులోని నలుగురు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే, అదేవేగంతో ముందు వెళ్తున్న కారును ఢీకొట్టినా లేదంటే ఎదురుగా వచ్చే వాహనాన్ని డీకొట్టినా ఘోరం జరిగేది. కాగా, కారును ర్యాష్‌గా నడిపిన డ్రైవర్‌పై చర్యలు తీసుకోనున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన 10 సెకన్ల వీడియో క్లిప్ సీసీ కెమెరాకు చిక్కింది. కింది వీడియోలో ఆ దృశ్యాలను మీరు కూడా వీక్షించండి.
Atal #Rohtang Tunnel car accident caught on camera pic.twitter.com/9LpAY37Goz
— Ravinder Makhaik (@makhaik) December 5, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

