అతి ఆత్మవిశ్వాసమున్న యువతే కొవిడ్ సూపర్ స్ప్రైడర్లు : సర్వే
యువతలో ఉంటున్న అతి ఆత్మవిశ్వాసమే వారిని కొవిడ్ సూపర్ స్ప్రైడర్లుగా మారుస్తున్నది. ఈ విషయాలు రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం పరిశోధకుల సర్వేలో వెల్లడైంది.

రాజ్‌కోట్ : యువతలో ఉంటున్న అతి ఆత్మవిశ్వాసమే వారిని కొవిడ్ సూపర్ స్ప్రైడర్లుగా మారుస్తున్నది. ఈ విషయాలు రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం పరిశోధకుల సర్వేలో వెల్లడైంది. వీధుల్లో తిరిగే యువత కారణంగా ఇన్ఫెక్షన్ వ్యాప్తికి అతిపెద్ద మార్గమని సర్వే తెలిపింది. ఎందుకంటే యువకుల శారీరక రోగనిరోధక శక్తి ఇతరుల కన్నా ఎక్కువగా ఉంటుంది. దాంతో తమకు వైరస్ సోకదనే ధైర్యంతో తిరుగుతూ సూపర్ స్ప్రైడర్లుగా తయారవుతున్నారని పరిశోధకులు తెలిపారు. నగరంలో వైరస్ ఇన్ఫెక్షన్ వ్యాప్తిలో ఇటువంటి ఆలోచన ఉన్న యువకులు ‘సూపర్ స్ప్రేడర్స్’ పాత్రను పోషిస్తున్నారని సర్వే తెలిపింది.
రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం పరిశోధకులు తమ సర్వే ద్వారా వైరస్ యొక్క ‘సూపర్ స్ప్రెడర్స ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు హస్ముఖ్ చావ్డా, డింపుల్ రమణి నేతృత్వంలోని బృందం 1,080 మందిని సర్వే చేసింది. ఎటువంటి బలమైన కారణం లేకుండానే యువకులు వీధుల్లో తిరుగుతూ కనిపించారని, వీరిలో 71 శాతం మంది 15 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు వారని తెలిపారు.
వైరస్ ఇన్ఫెక్షన్ వ్యాప్తికి టీనేజర్స్, యువత వాస్తవ కారకులని కనుగొన్నాం. వారు కారణం లేకుండా వీధుల్లో తిరగడమే కాకుండా సామాజిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం వంటి కొవిడ్ ప్రోటోకాల్‌ను కూడా అనుసరించరని తెలుసుకున్నాం. వాస్తవానికి లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూ ఉన్నప్పటికీ నగరంలో రోజువారీ ఇన్ఫెక్షన్ కేసులు తగ్గడం లేదని పరిశోధకులు కనుగొన్నారు.
ఒక్క రాజ్‌కోట్‌లోనే 35 వేలకు పైగా కేసులు నమోదైన విషయం పేపర్ల ద్వారా తెలుసుకున్నప్పటికీ.. యువకులు మాత్రం ఇండ్లకు పరిమితం కావడం లేదని తమ పరిశోధనలో తేలిందని డింపుల్ రమణి చెప్పారు. అబద్ధాలు చెప్పి ఇంటి నుంచి బయట తిరగడం, అవసరం లేకున్నా స్పేహితులను కలుసుకోవడం చేస్తున్నారని తెలిపారు. రోడ్లపై ఎక్కువగా తిరుగుతున్నవారిలో 40-55 ఏండ్ల వయసు వారు 17 శాతం మంది ఉన్నారని, 56 ఏండ్లకు పైబడిన వారు 12 శాతం ఉన్నారని ఆమె పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
మీ అమ్మకు చెప్పు.. ఏదో ఒక రోజు సీఎం అవుతా..!
1 ఎంజీలో టాటా 65 శాతం వాటా కొనుగోలు
ఎన్నికల్లో ఓడిన మంత్రికి ఉన్నత పదవి.. టీఎంసీలో చేరిన వామపక్ష నేతలు
నౌకలు నిలిచిపోకుండా సూయెజ్ కాలువలో పనులు
కొవిడ్ సెకండ్ వేవ్ వెళ్లిపోయింది.. కానీ, ముప్పు ఇంకా అలాగే ఉంది..
ఎన్నికల విధుల్లో చనిపోయిన వారికి కోటి ఇవ్వాల్సిందే: అలహాబాద్ హైకోర్టు
భారత చిన్నారులపై కోవాక్సిన్ ట్రయల్స్.. ఎక్స్పర్ట్ ప్యానెల్ ఆమోదం
సేవకు ప్రతిరూపాలు వీరే.. చరిత్రలో ఈరోజు
పండ్ల రారాజు మామిడితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

