e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News సేవ‌కు ప్ర‌తిరూపాలు వీరే.. చరిత్ర‌లో ఈరోజు

సేవ‌కు ప్ర‌తిరూపాలు వీరే.. చరిత్ర‌లో ఈరోజు

సేవ‌కు ప్ర‌తిరూపాలు వీరే.. చరిత్ర‌లో ఈరోజు

చిరున‌వ్వుతో ప‌లుక‌రిస్తూ.. మ‌న మంచి చెడ్డ‌ల్ని తెలుసుకుంటూ మ‌న‌కు స్వాంత‌న చేకూర్చే వారే నర్సులు. రోగులు వైద్యులు ఇచ్చే చికిత్స ఎంత ముఖ్య‌మో.. అంతే స‌మానంగా నర్సుల సేవ‌లు కూడా. ధనవంతుల కుటుంబంలో పుట్టి.. వివాహం చేసుకోకుండా జీవితాన్ని సేవకే అంకితం చేసిన మహనీయురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్‌. 1820 మే 12న ఇటలీలో జన్మించిన ఫ్లోరెన్స్ నైటింగేల్ బాల్యం నుంచి భిన్నంగా ఆలోచించి తోటి వారికి సాయపడటంలో ఎక్కువ ఆనందం పొందేది. ఆ ఆనందమే ఆమెను నర్స్ ట్రైనింగ్ తీసుకునేలా చేసింది.

ఎక్కడ బాధలున్నా అమె ప్రత్యక్షం. ఎచ్చట పేదరికం ఉన్నా అమె హాజరు. తన చేతనైనంత సాయం చేశారు. మానవాళికి తోడ్పడ్డారు. అందుకే ఆమెను “లేడీ విత్ ది లాంప్ష అని ముద్దుగా పిలుచుకునే వారు. ఆమె రచనలు నేటి తరానికి కరదీపికలు. ఆమె సేవలు నేటి తరానికి ఆదర్శం. ఆమె జీవితం అందరికీ ఆదర్శప్రాయం. ఆమె జ‌యంతికి గుర్తుగా ప్ర‌తి యేటా మే 12 ను అంత‌ర్జాతీయ నర్సింగ్ డే జ‌రుపుకుంటాం.

1852 లో ఐర్లాండ్ వెళ్ళిన ఆమెకు అక్కడి ద‌వాఖాన‌లను చూడగానే విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాల‌న్న కోరిక క‌లిగింది. అక్క‌డ ప‌నులు చేస్తుండ‌గానే.. 1853 లో సిస్టర్స్ ఆఫ్ చారిటికి వెళ్లే అవ‌కాశాన్ని అందిపుచ్చుకున్న‌ది. నాయనమ్మకు సేవ చేసేందుకు లండ‌న్‌కు రాగా అక్కడ కలరా వ్యాధి వ్యాపించింది. వెంటనే ద‌వాఖాన‌ల‌కు వెళ్లి రోగులకు సేవలందించ‌డం ప్రారంభించింది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ.. రోగులకు మంచి ఆహారాన్ని అందించింది. 1854-56 లో క్రిమియాలో ఘోర యుద్ధం జరిగిన స‌మ‌యంలో తోటి నర్సులను కూడగట్టుకొని యుద్ధంలో గాయాలైన సైనికులకు నిరుపమానమైన సేవలందించింది. గుండె నిబ్బరంతో, చిమ్మ చీకట్లో కూడా చిరు దీపం వెంట తీసుకుని వెళ్లి సేవలు చేసేది. రోగుల ముఖం మీద చిరునవ్వు ఆమె చేతిలో దీపంలాగా వెలిగేది.

రాయల్ స్టాటిటికల్ సొసైటీలో మొదటి మహిళా సభ్యురాలిగా 1858లో నైటింగేల్ చేరింది. ఆ తర్వాత 1860లో లండన్‌లోని సెయింట్ థామస్ హాస్పిటల్‌లో ఆధునిక నర్సింగ్ స్కూల్‌ను స్థాపించి ఎంద‌రో న‌ర్సుల‌ను తీర్చిదిద్దారు. 1910 ఆగస్ట్ 13 లో ఫ్లారెన్స్ మరణించినప్ప‌టికీ.. సేవా నిరతిగల ప్రతి నర్సులోను ఆమె కలకాలం జీవించి ఉంటుంద‌న‌డంలో ఎలాంటి ఔచిత్యం లేదు.

వీరి రుణం తీర్చుకోలేనిది..

సేవ‌కు ప్ర‌తిరూపాలు వీరే.. చరిత్ర‌లో ఈరోజు

ప్ర‌స్తుత క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో ఎంద‌రో న‌ర్సులు త‌మ‌త‌మ కుటుంబాల‌ను వ‌దిలి మ‌న ఆరోగ్యర‌క్ష‌ణ‌లో నిమ‌గ్న‌మై ఉన్నారు. ఇలాంటి వారందిరికీ ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. మ‌నం రోగంతో ద‌వాఖాన‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి మ‌న‌ల్ని కంటికి రెప్ప‌లా కాపాడుతూ మ‌న‌కు స్వ‌స్త‌త చేకూర్చ‌డంలో వీరి పాత్ర అమోఘ‌మైన‌ది. విసుగూ విరామం లేకుండా మ‌న ఆరోగ్య‌మే ప‌ర‌మావ‌ధిగా సేవ‌లందించే వీరి సేవ‌ల‌ను ఎంత కొనియాడినా త‌క్కువే.

మ‌రికొన్ని ముఖ్య సంఘ‌ట‌న‌లు..

2019: చెన్నై సూపర్ కింగ్స్‌ను ఒక‌ పరుగు తేడాతో ఓడించి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న ముంబై ఇండియన్స్

2017: అహ్మదాబాద్‌లో మొదటి గాలి నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థ ప్రారంభం

2010: లిబియాలోని ట్రిపోలీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో 103 మంది దుర్మ‌ర‌ణం

2008 : చైనాలోని సిచువాన్‌లో భూకంపం, 90 వేల మంది మృతి

2002: ఫిడేల్ కాస్ట్రోతో చర్చలు జరిపేందుకు ఐదు రోజుల పర్యటనలో క్యూబా చేరుకున్న అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్

1965 : ల్యూనార్‌-5 ను ప్రయోగించిన సోవియ‌ట్‌ యూనియ‌న్‌

1941: ప్రపంచంలో మొట్టమొదటి పూర్తి ఆటోమేటెడ్ డిజిటల్ కంప్యూటర్ జెడ్ 3 మొదట బెర్లిన్‌లో ప్రారంభం

1889 : ప్రపంచంలో మొట్టమొదటి భారతీయేతర యోగా గురువు యూజీన్ పీటర్సన్ జననం

1666: పురందర్ ఒప్పందం ప్రకారం ఔరంగజేబును కలిసిన ఛ‌త్ర‌ప‌తి శివాజీ

ఇవి కూడా చ‌ద‌వండి..

జీ 7 శిఖరాగ్ర భేటీకి మోదీకి ఆహ్వానం.. వెళ్లకూడదని నిర్ణయం

తేహ్రీలో ఆకస్మిక వరదలు.. పెద్ద ఎత్తున నష్టం

1.41 బిలియన్లకు చైనా జనాభా.. రానున్న రోజుల్లో కష్టాలు తప్పవా..?!

పండ్ల రారాజు మామిడితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!

తుపాకులను నియంత్రించాల్సిందే: పుతిన్‌

10 వేల మందికి బయో బబుల్‌ సాధ్యమేనా? : సెరెనా విలియమ్స్‌

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సేవ‌కు ప్ర‌తిరూపాలు వీరే.. చరిత్ర‌లో ఈరోజు

ట్రెండింగ్‌

Advertisement