1.41 బిలియన్లకు చైనా జనాభా.. రానున్న రోజుల్లో కష్టాలు తప్పవా..?!
చైనా జనాభా 1.41 బిలియన్లకు చేరింది. జనాభా మరింత పెరిగే అవకాశం ఉన్నది. గతంలో కన్నా స్వల్పంగా పెరుగుదల కనిపించింది.

బీజింగ్: చైనా జనాభా 1.41 బిలియన్లకు చేరింది. జనాభా మరింత పెరిగే అవకాశం ఉన్నది. గతంలో కన్నా స్వల్పంగా పెరుగుదల కనిపించింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా తన స్థానాన్ని పదిలపర్చుకున్నది. అయితే, వచ్చే ఏడాది నుంచి చైనా జనాభా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఫలితంగా కార్మికుల కొరతతోపాటు దేశంలో వినియోగం కూడా తగ్గుతుందని భావిస్తున్నారు.
చైనా ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ఏడవ జాతీయ జనాభా నివేదిక ప్రకారం, చైనాలోని మొత్తం 31 రాష్ట్రాలు, స్వయం ప్రతిపత్తి ప్రాంతాలు, మునిసిపాలిటీలు కలుపుకుని దేశ జనాభా 1.41178 బిలియన్లకు చేరింది. ఇందులో హాంకాంగ్, మకావు ప్రాంతాల జనాభాను కలుపలేదు. నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్బీఎస్) ఈ గణాంకాలను విడుదల చేసింది.
చైనాలో జనాభా సంక్షోభం తీవ్రమవుతున్నది. అక్కడ 60 ఏండ్ల వయసు పైబడిన వారి జనాభా 18.7 శాతం పెరిగింది. ఎన్బీఎస్ విడుదల చేసిన ప్రకటనలో పెద్ద సంఖ్యలో ప్రజలు వృద్ధాప్యం కావడం వల్ల రాబోయే సంవత్సరాల్లో దీర్ఘకాలిక సమతుల్య అభివృద్ధిపై ఒత్తిడి పెరుగుతుందని పేర్కొన్నారు.
చైనా జనాభాలో 15 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల వారి సంఖ్య 89.40 మిలియన్లు. 2010 జనాభా లెక్కలతో పోలిస్తే ఇది 6.79 శాతం తగ్గింది. ఏడవ జనాభా లెక్కల ప్రకారం, చైనాలో జనాభా పెరుగుదల రేటు ఏటా 0.57 శాతంగా ఉన్నది. ఇది 2010 ఆరో జనాభా లెక్కల ప్రకారం 0.57 శాతం, 2000 ఐదో జనాభా లెక్కల ప్రకారం 1.07 శాతంగా ఉన్నది. 1982 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో గరిష్ఠంగా 2.1 శాతం పెరుగుదల నమోదైంది. అప్పటి నుంచి జనాభా పెరుగుదలలో స్థిరమైన క్షీణత కనిపించింది.
1950 నుంచి చైనా జనాభాలో ఇది అతి తక్కువ పెరుగుదలగా గుర్తించారు. దీని కారణంగా ఆర్థిక వ్యవస్థ వేగవంతానికి చేసే ప్రయత్నాలు జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశం ఎదుర్కొంటున్న పరిస్థితికి చేరుతుందని భావిస్తున్నారు. సంతానోత్పత్తి రేటు 1.3 అని డాటా చూపిస్తుంది. ఇది వృద్ధాప్య దేశమైన జపాన్, ఇటలీకి సమానం. వన్ చైల్డ్ పాలసీకి కొంత సడలింపు ఇస్తుండగా.. 2020 నాటికి 1.42 బిలియన్లకు చేరుకోవాలని 2016 లో చైనా లక్ష్యంగా పెట్టుకున్నది.
ఇవి కూడా చదవండి..
పండ్ల రారాజు మామిడితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!
క్వాడ్‌లో చేరడంపై బంగ్లాదేశ్‌ను హెచ్చరించిన చైనా
తుపాకులను నియంత్రించాల్సిందే: పుతిన్
పర్షియన్ గల్ఫ్‌లో యూఎస్-ఇరాన్ మళ్లీ ముఖాముఖి
10 వేల మందికి బయో బబుల్ సాధ్యమేనా? : సెరెనా విలియమ్స్
రష్యాలో పాఠశాలపై కాల్పులు: 13 మంది దుర్మరణం
అప్పట్లో అమ్మతో ఇప్పటి బిలియనీర్.. ఎవరో తెలుసా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

