తుపాకులను నియంత్రించాల్సిందే: పుతిన్
దేశంలో తుపాకులను నియంత్రించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. రష్యాలోని కజాన్ పాఠశాల కాల్పుల నేపథ్యంలో తుపాకుల నియంత్రణపై అధికారులతో పుతిన్ సమీక్ష జరిపారు.

మాస్కో: దేశంలో తుపాకులను నియంత్రించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. రష్యాలోని కజాన్ పాఠశాల కాల్పుల నేపథ్యంలో తుపాకుల నియంత్రణపై అధికారులతో పుతిన్ సమీక్ష జరిపారు. తుపాకుల నియంత్రణ చట్టాన్ని సమీక్షించాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు.
రష్యా సెంట్రల్ సిటీ అయిన కజాన్‌లోని ఒక ఉన్నత పాఠశాలలో గుర్తుతెలియన వ్యక్తులు జరిపిన కాల్పుల్లో 13 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు. ఓ ఉపాధ్యాయుడిని కూడా దుండగులు కాల్చి చంపారు. భద్రతా దళాలు పాఠశాలను తమ ఆధీనంలోకి తీసుకుని దుండగులను పట్టుకునే పనిలో ఇద్దరిని కాల్చిచంపారు. ఈ నేపథ్యంలో తుపాకుల నియంత్రణ చట్టాన్ని సమీక్షించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించినట్లు క్రెమ్లిన్ తెలిపింది. ఈ దాడిలో ఉపయోగించిన ఆయుధాన్ని పరిగణనలోకి తీసుకొని పౌరుల చేతుల్లో ఉండే ఆయుధాల రకానికి సంబంధించి కొత్త నిబంధనలను అత్యవసరంగా రూపొందించాలని అధ్యక్షుడు ఆదేశించారు అని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ విలేకరులతో అన్నారు.
ఇవి కూడా చదవండి..
పర్షియన్ గల్ఫ్‌లో యూఎస్-ఇరాన్ మళ్లీ ముఖాముఖి
10 వేల మందికి బయో బబుల్ సాధ్యమేనా? : సెరెనా విలియమ్స్
రష్యాలో పాఠశాలపై కాల్పులు: 13 మంది దుర్మరణం
18 ఏండ్ల పైబడిన వారికి టీకాలు.. ప్రచారాన్ని ప్రారంభించిన తీరత్ సింగ్
బెంగాల్లో హింసను నిరసిస్తూ అమెరికాలో ప్రదర్శనలు
అప్పట్లో అమ్మతో ఇప్పటి బిలియనీర్.. ఎవరో తెలుసా..?
అమెరికా చమురు పైప్‌లైన్‌పై సైబర్ దాడి.. ఎమర్జెన్సీ ప్రకటన
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

