బెంగాల్లో హింసను నిరసిస్తూ అమెరికాలో ప్రదర్శనలు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతర హింసాకాండను నిరసిస్తూ బెంగాలీ ప్రవాసులతో పాటు ప్రవాస భారతీయులు అమెరికాలోని పలు నగరాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

హూస్టన్ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతర హింసాకాండను నిరసిస్తూ బెంగాలీ ప్రవాసులతో పాటు ప్రవాస భారతీయులు అమెరికాలోని పలు నగరాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దాదాపు 30 నగరాల్లో ఈ ప్రదర్శనలు జరిగినట్లు ప్రవాస భారతీయులు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ప్రదర్శనలో భారతీయ-అమెరికన్లతో పాటు పెద్ద సంఖ్యలో వలస బెంగాలీలు ఉన్నారు. “హిందూ లీవ్స్ మేటర్”, “హిందూ జెనోసైడ్కు వ్యతిరేకంగా నిరసన” అని రాసివున్న ప్లకార్డులను ప్రదర్శించారు.
జుడాజిత్ సేన్ మజుందార్ సిలికాన్ వ్యాలీలో వ్యాపారం చేస్తుంటాడు. ఈ నిరసన ప్రదర్శనకు హాజరైనప్పుడు.. తాను తరుచుగా బెంగాల్ వెళ్తుంటానని, అక్కడ ప్రణాళికబద్ధంగా మారణహోమం జరుగుతున్నదని విచారం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న అరాచకాన్ని నిరసిస్తూ అమెరికాలోని 30 నగరాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తున్నాట్లు చెప్పారు.
కాగా, బెంగాల్లో చెలరేగిన హింసను బ్రిటన్ సహా అనేక ఇతర దేశాలు కూడా ఖండించాయి. హింసపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుపాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. హూస్టన్లో నివసించే రచయిత సహానా సింగ్ తాను కోల్కతాలో పెరిగానని , ఎన్నికల తరువాత బెంగాల్లో దేశ విభజన సమయంలో జరిగినంత హింస చోటుచేసుకున్నదని గుర్తుచేశారు.
ఇవి కూడా చదవండి..
18 ఏండ్ల పైబడిన వారికి టీకాలు.. ప్రచారాన్ని ప్రారంభించిన తీరత్ సింగ్
అప్పట్లో అమ్మతో ఇప్పటి బిలియనీర్.. ఎవరో తెలుసా..?
ప్రైవసీ పాలసీని గడువు వాయిదా వేసుకున్న వాట్సాప్.. ఎందుకో తెలుసా..?
అమెరికా చమురు పైప్లైన్పై సైబర్ దాడి.. ఎమర్జెన్సీ ప్రకటన
మాడ్రిడ్ ఓపెన్ : రెండోసారి టైటిల్ గెల్చుకున్న జ్వెరెవ్
దక్షిణాఫ్రికా దేశాధ్యక్ష పీఠంపై నెల్సన్ మండేలా.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

