క్వాడ్‌లో చేరడంపై బంగ్లాదేశ్‌ను హెచ్చరించిన చైనా
చైనాకు వ్యతిరేకంగా ఏర్పడిన క్వాడ్ క్లబ్లో బంగ్లాదేశ్ చేరడంపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. దాంతోపాటు బంగ్లాదేశ్‌ను హెచ్చరించింది.

ఢాకా: చైనాకు వ్యతిరేకంగా ఏర్పడిన క్వాడ్ క్లబ్లో బంగ్లాదేశ్ చేరడంపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. దాంతోపాటు బంగ్లాదేశ్‌ను తీవ్రంగా హెచ్చరించింది. ఈ క్వాడ్ క్లబ్లో చేరడం వల్ల ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు గణనీయమైన నష్టం సంభవిస్తుందని చైనా పేర్కొన్నది. అమెరికా నేతృత్వంలో క్వాడ్ కూటమి ఏర్పాటైంది. ఈ కూటమిలో అమెరికాతోపాటు జపాన్, ఆస్ట్రేలియా, భారత్ దేశాలు ఉన్నాయి. ఈ కూటమిని 2007 లో ప్రారంభించారు. సముద్ర జలాల్లో ఆధిపత్యాన్ని పెంచుకోవడంతోపాటు సంయుక్త మిలిటరీ నౌకా విన్యాసాలు జరుపడం ఈ కూటమి ప్రధాన ఉద్దేశం.
ఈ కూటమిలో చేరాలని బంగ్లాదేశ్‌కు ఇప్పటికే ఆహ్వానం అందింది. దీనిపై ఆక్షేపణ వ్యక్తం చేసిన చైనా.. క్వాడ్ కూటమితో చేరొద్దని, అలా చేరడం వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరించింది.
దక్షిణ ఆసియాలో సైనిక కూటమి ఏర్పాటుకు బంగ్లాదేశ ప్రాంతానికి వెలుపల ఉన్న శక్తులకు వ్యతిరేకంగా ఉమ్మడి ప్రయత్నాలు చేయాలని చైనా రక్షణ మంత్రి జనరల్ వీ ఫెంగ్.. బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్‌కు ఉద్ఘాటించారు. ఇది జరిగిన కొన్ని వారాల తర్వాత బంగ్లాదేశ్‌లోని చైనా రాయబారి లి జిమింగ్ నుంచి అసాధారణ హెచ్చరిక వచ్చింది. బంగ్లాదేశ్ ఈ నాలుగు దేశాల క్లబ్లో చేరడం మంచి ఆలోచన కాదని, దీనివల్ల ద్వైపాక్షిక సంబంధాలు గణనీయంగా దెబ్బతింటాయని బంగ్లాదేశ్‌లోని చైనా రాయబారి లి జిమింగ్ .. బంగ్లాదేశ్‌లోని డిప్లొమాటిక్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో తెలిపారు.
కాగా, చైనా రాయబారి లి జిమింగ్ వివాదాస్పద వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎకె అబ్దుల్ మోమెన్ స్పందించారు. ఢాకా సమతుల్య విదేశాంగ విధానాన్ని నిర్వహిస్తున్నాదని, ఆ సూత్రాల ప్రకారం ఏమి చేయాలో నిర్ణయిస్తుందని చెప్పారు. ‘మాది స్వతంత్ర, సార్వభౌమ రాజ్యం. మేం మా విదేశాంగ విధానాన్ని నిర్ణయిస్తాం. ఎవరో మాకు చెప్పడం అంత మంచిది కాదు’ అని ఆయన మంగళవారం మీడియాతో అన్నారు.
ఇవి కూడా చదవండి..
తుపాకులను నియంత్రించాల్సిందే: పుతిన్
పర్షియన్ గల్ఫ్‌లో యూఎస్-ఇరాన్ మళ్లీ ముఖాముఖి
10 వేల మందికి బయో బబుల్ సాధ్యమేనా? : సెరెనా విలియమ్స్
రష్యాలో పాఠశాలపై కాల్పులు: 13 మంది దుర్మరణం
18 ఏండ్ల పైబడిన వారికి టీకాలు.. ప్రచారాన్ని ప్రారంభించిన తీరత్ సింగ్
బెంగాల్లో హింసను నిరసిస్తూ అమెరికాలో ప్రదర్శనలు
అప్పట్లో అమ్మతో ఇప్పటి బిలియనీర్.. ఎవరో తెలుసా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

