e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home News ఎన్నిక‌ల్లో ఓడిన మంత్రికి ఉన్న‌త ప‌ద‌వి.. టీఎంసీలో చేరిన వామ‌ప‌క్ష నేత‌లు

ఎన్నిక‌ల్లో ఓడిన మంత్రికి ఉన్న‌త ప‌ద‌వి.. టీఎంసీలో చేరిన వామ‌ప‌క్ష నేత‌లు

ఎన్నిక‌ల్లో ఓడిన మంత్రికి ఉన్న‌త ప‌ద‌వి.. టీఎంసీలో చేరిన వామ‌ప‌క్ష నేత‌లు

సిలిగురి : వ‌డ్డించేవాడు మ‌నోడైతే.. బంతిలో ఎక్క‌డ కూర్చున్నా ఇబ్బంది ఉండ‌దు అనేది పాత నానుడి. పార్టీ అధినేత అనుకుంటే ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలైనా ఉన్న‌త ప‌ద‌వి ద‌క్కుతుంది అనేది ఇవ్వాల్టి నానుడి. ఇటీవ‌లి ప‌శ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలైన మాజీ మంత్రి గౌత‌మ్ దేవ్‌ను అదృష్టం త‌లుపు త‌ట్టింది. ఆయ‌న‌ను సిలిగురి కార్పొరేష‌న్ అడ్మినిస్ట్రేట‌ర్‌గా టీఎంసీ అధినేత‌, ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ నియ‌మించారు. ఇదే స‌మ‌యంలో సిలిగురికి చెందిన ఇద్ద‌రు వామ‌ప‌క్ష పార్టీ సీనియ‌ర్ నేత‌లు టీఎంసీ కండువా క‌ప్పుకున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీ తిరిగి పొంద‌డంతో సిలిగురిలో రాజకీయ ప్రకంపనలు తీవ్రమయ్యాయి. ఇక్క‌డ ఎమ్మెల్యేగా ఓట‌మి పాలైన మాజీ మంత్రి గౌతమ్ దేవ్‌ను సిలిగురి మున్సిపల్ కార్పొరేషన్ అడ్మినిస్ట్రేట‌ర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేర‌కు బుధ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. సిలిగురి మునిసిపల్ కార్పొరేషన్‌లో ఆధిప‌త్యం చ‌లాయించేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాల్లో భాగంగానే గౌత‌మ్ దేవ్ నియామ‌కం జ‌రిగిన‌ట్లు రాజ‌కీయ పండితులు భావిస్తున్నారు.

ఇదే స‌మ‌యంలో లెఫ్ట్ ఫ్రంట్ సీనియ‌ర్ నేత‌, సిలిగురి బోర్డు మాజీ డిప్యూటీ మేయ‌ర్ క‌మ‌ల్ అగ‌ర్వాల్‌, మ‌రో సీనియ‌ర్ నేత రామ్‌భ‌జ‌న్‌తో క‌లిసి టీఎంసీలో చేరారు. మునిసిపల్ కార్పొరేషన్‌లో ముఖ్య పదవులను నిర్వహించిన ఈ ఇద్దరు నాయకులు టీఎంసీలో చేరడం ద్వారా టీఎంసీ బలపడిందని గౌత‌మ్ దేవ్ చెప్పారు. సిలిగురిలో పార్టీ అభివృద్ధికి పాటుప‌డ‌నున్న‌ట్లు మాజీ మేయర్లు అశోక్ నారాయణ్ భట్టాచార్య, గంగోత్రి దత్ స్ప‌ష్టంచేయ‌డం విశేషం. రానున్న మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో వీరి సామ‌ర్ధ్యాన్ని పార్టీ వినియోగించుకుంటుంద‌ని టీఎంసీ జిల్లా శాఖ అధ్య‌క్షుడు రంజ‌న్ స‌ర్కార్ పేర్కొన్నారు.

ప్ర‌జల ఆకాంక్ష‌ల మేర‌కే టీఎంసీలో చేరాం..

గత 15 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉండి ప్రజల డిమాండ్ల‌ను తీర్చలేకపోయామని, అందుకే అధికార పార్టీతో కలిసి రావడం ద్వారా వారి కోసం కృషి చేయాలని నిర్ణయించిన‌ట్లు రామ్ భ‌జ‌న్‌, క‌మ‌ల్ అగ‌ర్వాల్ తెలిపారు. ప్రజల ఆకాంక్ష‌ల మేర‌కు రాజ‌కీయ నాయ‌కులు ప‌నిచేయాల‌ని, ఆ అవ‌కాశాన్ని ఒడిసిప‌ట్టుకోవ‌డానికే టీఎంసీలో చేరిన‌ట్లు వారు వెల్ల‌డించారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో పార్టీ అధిష్ఠానం నిర్ణ‌యం మేర‌కు ప‌నిచేసి పార్టీని ముందు వ‌రుస‌లో నిలుపుతామ‌న్నారు. వీరిక‌న్నా ముందు ఎంఐసీ దుర్గా సింగ్ టీఎంసీలో చేరగా, ఎంఐసీ శంకర్ ఘోష్ బీజేపీలో చేరి మొన్న‌టి ఎన్నిక‌ల్లో సిలిగురి ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

నౌక‌లు నిలిచిపోకుండా సూయెజ్ కాలువ‌లో ప‌నులు

కొవిడ్ సెకండ్ వేవ్ వెళ్లిపోయింది.. కానీ, ముప్పు ఇంకా అలాగే ఉంది..

ఎన్నిక‌ల విధుల్లో చ‌నిపోయిన వారికి కోటి ఇవ్వాల్సిందే: అల‌హాబాద్ హైకోర్టు

భార‌త చిన్నారుల‌పై కోవాక్సిన్ ట్ర‌య‌ల్స్‌.. ఎక్స్‌ప‌ర్ట్ ప్యానెల్ ఆమోదం

సేవ‌కు ప్ర‌తిరూపాలు వీరే.. చరిత్ర‌లో ఈరోజు

జీ 7 శిఖరాగ్ర భేటీకి మోదీకి ఆహ్వానం.. వెళ్లకూడదని నిర్ణయం

పండ్ల రారాజు మామిడితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎన్నిక‌ల్లో ఓడిన మంత్రికి ఉన్న‌త ప‌ద‌వి.. టీఎంసీలో చేరిన వామ‌ప‌క్ష నేత‌లు

ట్రెండింగ్‌

Advertisement