భారత చిన్నారులపై కోవాగ్జిన్ ట్రయల్స్.. ఎక్స్పర్ట్ ప్యానెల్ ఆమోదం
భారతదేశంలోని చిన్నారులపై కోవాగ్జిన్ వ్యాక్సిన్ ట్రయల్స్ జరుపనున్నారు. 2 నుంచి 18 ఏండ్ల వయసు ఉన్న పిల్లలకు కోవాగ్జిన్ రెండవ, మూడవ ట్రయల్స్ నిర్వహించనున్నారు

హైదరాబాద్ : భారతదేశంలోని చిన్నారులపై కోవాగ్జిన్ వ్యాక్సిన్ ట్రయల్స్ జరుపనున్నారు. 2 నుంచి 18 ఏండ్ల వయసు ఉన్న పిల్లలకు కోవాగ్జిన్ రెండవ, మూడవ ట్రయల్స్ నిర్వహించనున్నారు. దీనికి నిపుణుల ప్యానెల్ ఆమోదం తెలిపింది. అంతా సక్రమంగా జరిగితే.. కెనడా, అమెరికా తర్వాత భారత్‌లో కూడా 18 ఏండ్లలోపు పిల్లలకు కూడా కరోనా స్వదేశీ టీకా సిద్ధంగా ఉండనున్నది.
ఎయిమ్స్ ఢిల్లీ, ఎయిమ్స్ పాట్నా, మెడిట్రినా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నాగ్‌పూర్‌లో 525 అంశాలపై ట్రయల్ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో భారత్ బయోటెక్ ప్రతిపాదనను సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కమిటీ మంగళవారం పరిశీలించింది. ఈ మేరకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్కో) సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కమిటీ (ఎస్ఈసీ) ఆమోదం తెలిపింది.
మూడవ దశ ట్రయల్స్ కోసం సీడీస్కో నుంచి అనుమతి తీసుకునే ముందు డాటా అండ్ సేఫ్టీ మానిటరింగ్ బోర్డ్ (డీఎస్ఎంబీ) కి రెండవ దశకు సంబంధించి సెక్యూరిటీ డాటాను అందించాలని నిపుణుల కమిటీ సంస్థను ఆదేశించినట్లు డీఎస్ఎంబీ వర్గాలు తెలిపాయి. అంతకుముందు ఫిబ్రవరి 24 న జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించి, సవరించిన క్లినికల్ ట్రయల్ ప్రోటోకాల్‌ను ప్రవేశపెట్టాలని భారత్ బయోటెక్‌ను ఆదేశించారు.
దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకాను భారత్ బయోటెక్.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సహకారంతో దేశంలో టీకా కార్యక్రమం కోసం 18 ఏండ్ల వయసు పైబడిన వారి కోసం ఉపయోగిస్తున్నారు. 12 నుంచి 15 సంవత్సరాల పిల్లలకు ఫైజర్-బయోఎంటెక్ కరోనా వ్యాక్సిన్‌ను అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సోమవారం ఆమోదించింది. కెనడా గతంలో ఈ పిల్లల టీకాను ఆమోదించింది.
ఇవి కూడా చదవండి..
సేవకు ప్రతిరూపాలు వీరే.. చరిత్రలో ఈరోజు
జీ 7 శిఖరాగ్ర భేటీకి మోదీకి ఆహ్వానం.. వెళ్లకూడదని నిర్ణయం
తేహ్రీలో ఆకస్మిక వరదలు.. పెద్ద ఎత్తున నష్టం
1.41 బిలియన్లకు చైనా జనాభా.. రానున్న రోజుల్లో కష్టాలు తప్పవా..?!
పండ్ల రారాజు మామిడితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!
తుపాకులను నియంత్రించాల్సిందే: పుతిన్
10 వేల మందికి బయో బబుల్ సాధ్యమేనా? : సెరెనా విలియమ్స్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

