అహద్మాబాద్: పెళ్లైన మహిళతో దళిత వ్యక్తికి వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆమె కుటుంబం ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని కిడ్నాప్ చేశారు. అతడ్ని కొట్టి నగ్నంగా ఊరేగించారు. (Dalit Man Trashed, Paraded Naked) ఆ యువకుడి చేత బలవంతంగా లేఖ రాయించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో మహిళ భర్త, ఆమె కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుజరాత్‌లోని సబర్కాంత జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
మార్చి 11న రాత్రి వేళ హిమ్మత్‌నగర్ ప్రాంతానికి చెందిన దళిత యువకుడ్ని కొందరు వ్యక్తులు అతడి ఇంటి నుంచి కిడ్నాప్ చేశారు. ఒక ప్రాంతానికి అతడ్ని తీసుకెళ్లాడు. మహిళతో వివాహేతర సంబంధంపై అతడ్ని కొట్టారు. ఆ తర్వాత దళిత యువకుడ్ని నగ్నంగా ఊరేగించారు. బలవంతంగా క్షమాపణ లేఖ రాయించిన తర్వాత అతడ్ని విడిచిపెట్టారు.
మరోవైపు దళిత యువకుడ్ని కొట్టి నగ్నంగా ఊరేగించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో బాధిత దళిత వ్యక్తిని పోలీసులు సంప్రదించారు. అతడి ఫిర్యాదుతో మహిళ భర్త, ఆమె కుటుంబ సభ్యులపై ఎస్సీ, ఎస్టీ చట్టం, కిడ్నాప్, దాడికి సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
A #Dalit man was thrashed and paraded naked in #Gujarat‘s #Sabarkantha district allegedly by the husband and family of the woman with whom he was having an affair, a police official said on Thursday.
A video of the incident, which took place in a village near Idar town on the… pic.twitter.com/fojuvUT6wP
— Hate Detector 🔍 (@HateDetectors) March 14, 2025