న్యూఢిల్లీ, మార్చి 29: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయటానికి ఈసీ అవకాశం కల్పించిన సీ విజిల్ యాప్‌కు విపరీతమైన తాకిడి పెరిగింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక కేవలం రెండు వారాల్లో అనూహ్యంగా 79 వేల ఫిర్యాదులు వచ్చినట్టు ఈసీ వెల్లడించింది. వీటిలో 99శాతం ఫిర్యాదులను పరిష్కరించినట్టు తెలిపింది.
89 శాతం ఫిర్యాదులను కేవలం వంద నిమిషాల్లోనే పరిష్కరించామని పేర్కొన్నది. సీ విజిల్ అనేది కోడ్ ఉల్లంఘనులను గుర్తించేందుకు పౌరులకు లభించిన అద్భుతమైన సాధనమని ఈసీ పేర్కొన్నది. దీనిని సక్రమంగా వినియోగించుకోవాలని కోరింది.