లగ్జరీ కారులో పట్టబడిన 600 బాటిళ్ల మద్యం..
సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న బీహార్‌లో భారీగా విదేశీ మద్యం (Foreign liquor) పట్టుబడింది. రాష్ట్రంలోని ఆరా జిల్లా బలువాలో లగ్జరీ కారులో విదేశీ మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా
పట్నా: సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న బీహార్‌లో భారీగా విదేశీ మద్యం (Foreign liquor) పట్టుబడింది. రాష్ట్రంలోని ఆరా జిల్లా బలువాలో లగ్జరీ కారులో విదేశీ మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా 600 బాటిళ్ల మద్యాన్ని సీజ్ చేశారు. విదేశీ మద్యాన్ని సగ్లింగ్ చేస్తున్నారన్న నిర్ధిష్టమైన సమాచారంతో తనిఖీలు నిర్వహించామని జిల్లా ఎస్పీ ప్రమోద్ కుమార్ తెలిపారు. పట్టుబడినవాటిలో బ్లెండర్ ప్రైడ్ 38 బాటిళ్లు, రాయల్ స్టాగ్ 20 బాటిళ్లు, 8పీఎం బాటిళ్లు 576 ఉన్నాయని చెప్పారు. కాగా, స్మగ్లర్లు కారును వదిలేసి పారిపోయారని వెల్లడించారు. అయితే ఈ వ్యవహారంలో ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదుచేశామన్నారు.
రాష్ట్రంలోని సివాన్ జిల్లాలోని గ్రామంలో కల్తీ మద్యం తాగడంతో ముగ్గురు వ్యక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే. మరో ఆరుగురు తీవ్ర అస్వస్తతకు గురయ్యారు. బాధితులు సివాన్ జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్నారని జిల్లా మేజిస్ట్రేట్ అమిత్ కుమార్ పాండే తెలిపారు. అనుమానాస్పద స్థితిలో ముగ్గురు మృతిచెందారని, మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

