న్యూఢిల్లీ, డిసెంబర్ 5: దేశంలో 2019 నుంచి 2021 వరకు ప్రతి ఏడాది విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతూ వస్తున్నాయని, ఈ మూడేండ్లలో 35 వేల మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ మంత్రి అబ్బయ్య నారాయణ స్వామి లోక్సభలో వెల్లడించారు.
సామాజిక వివక్ష కారణంగా దేశంలో ఎంతమంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు? అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఆత్మహత్యల గురించి ప్రత్యేక వివరాలు లేవని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై వివక్ష, వేధింపుల నివారణకు దేశవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్ సెల్స్, గ్రీవెన్స్ సెల్స్, గ్రీవెన్స్ కమిటీలను నియమించినట్టు చెప్పారు.
2019 10,335
2020 12,526
2021 13,089