ఉత్తరాఖండ్లో చిన్నారులపై కరోనా పంజా..!
Corona in Children: ఉత్తరాఖండ్లో చిన్నారులపై కరోనా మహమ్మారి పంజా విసురుతున్నది.

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో చిన్నారులపై కరోనా మహమ్మారి పంజా విసురుతున్నది. ఇటీవల అక్కడ కరోనా బారిన పడుతున్న చిన్నారుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. కేవలం గత 10 రోజుల వ్యవధిలో తొమ్మిదేండ్ల లోపు వయసున్న 1000 మంది చిన్నారులకు కరోనా వైరస్ సోకిందని ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ తెలిపింది. వారిలో కొంతమంది చిన్నారులు ఆస్పత్రుల్లో చేరి చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించింది.
కాగా, ఉత్తరాఖండ్ ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏడాది దేశంలో కరోనా మహమ్మారి కాలు మోపినప్పటి నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు ఏడాది కాలంలో ఉత్తరాఖండ్లో కేవలం 2,131 మంది చిన్నారులు మాత్రమే కరోనా బారినపడ్డారు. ఆ తర్వాత చిన్నారుల్లో కరోనా స్పీడ్ పెరిగింది. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు పదిహేను రోజుల వ్యవధిలో 264 మందికి మాత్రమే వైరస్ సోకగా.. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు మరో 15 రోజుల వ్యవధిలో 1,053 మంది వైరస్ బారినపడ్డారు.
ఇక, మే 1 నుంచి 14 వరకు కేవలం 14 రోజుల వ్యవధిలో 1,618 మంది చిన్నారులకు వైరస్ సోకింది. కాగా, ఉత్తరాఖండ్లో ప్రస్తుతం 79,379 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 4,426 కరోనా మరణాలు సంభవించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

