లేహ్ : జమ్మూకశ్మీర్‌లోని లేహ్‌లో కలుషిత ఆహారం(Food Poisoning) తిని 100 మంది సినీ కార్మికులు అస్వస్థత గురయ్యారు. ప్రస్తుతం ఆ ఫిల్మ్ యూనిట్ వర్కర్ల ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఆదివారం రాత్రి వేళ ఎస్ఎన్ఎం ఆస్పత్రికి ఆ పేషెంట్లకు తీసుకువచ్చారు. తీవ్రమైన కడుపునొప్పి, తలనొప్పి, వాంతులు అవుతున్నట్లు ఆ వర్కర్లు ఫిర్యాదు చేశారు. బాలీవుడ్ సినిమా షూటింగ్ కోసం ఆ బృందం లేహ్‌లో ఉన్నది. ఆ కార్మికులు ఎవరూ స్థానికులు కాదు. ఆ లొకేషన్లో సుమారు 600 మంది భోజనం చేసినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన ప్రదేశం నుంచి ఆహార శ్యాంపిళ్లను విశ్లేషణ కోసం సేకరించారు. ఫుడ్ పాయిజనింగ్ జరిగినట్లు ఆస్పత్రి డాక్టర్లు చెబుతున్నారు. చాలా మంది రోగులను డిశ్చార్జ్ చేసినట్లు డాక్టర్ తెలిపారు.