న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని (Delhi) భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి కుండపోతగా కురుస్తున్న వానలతో (Heavy Rain) లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లు జలమయమయ్యాయి. నోయిడా, గురుగ్రామ్‌లో భారీ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచ్కుయన్ మార్గ్, కన్నౌట్ ప్యాలెస్, మథుర రోడ్డు, భారత్ మండపం సహా పలు ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Passenger Advisory issued at 00:10 Hours#DelhiAirport #PassengerAdvisory #DELAdvisory pic.twitter.com/ijnzu31Dq2
— Delhi Airport (@DelhiAirport) August 8, 2025
మరోవైపు వర్షాల నేపథ్యంలో విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలుగుతున్నది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే 100కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో నాలుగు విమానాలు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టు అడ్వైజరీ జారీ చేసింది. విమాన సర్వీసులకు సంబంధించి ప్రయాణికులు ఎప్పటికప్పుడు తమ తమ విమానయాన సంస్థల నుంచి తాజా సమాచారం తెలుసుకోవాలని సూచించింది. ప్రతికూల వాతావరణం కారణంగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని, ప్రయాణికులు సహకరించాలని ఇండిగో, స్పైస్‌జెట్ వంటి సంస్థలు తమ ప్రయాణికులను కోరాయి.
Travel Advisory
🚧⛈️Heads up, #Delhi travellers!
Due to today’s downpour, several roads across Delhi are currently blocked or experiencing slow movement.
Please allow extra time, take an alternate route if possible, and check your flight status on our website or app before…
— IndiGo (@IndiGo6E) August 9, 2025
మరోవైపు, శనివారం కూడా ఢిల్లీతోపాటు రాజధాని ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. రోజంతా వర్షం కురుస్తుందని వెల్లడించింది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లో కూడా సాధారణం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గత జూన్ 20 నుంచి హిమాచల్‌ప్రదేశ్‌లో వర్షాల వల్ల 200 మందికిపైగా చనిపోయారు.
#WeatherUpdate: Due to bad weather (heavy rain) in Delhi (DEL), all departures/arrivals and their consequential flights may get affected. Passengers are requested to keep a check on their flight status via https://t.co/2wynECZugy.
— SpiceJet (@flyspicejet) August 9, 2025
#WATCH | Delhi | Heavy rain causes waterlogging at the Panchkuian Marg pic.twitter.com/nldjJHoqhI
— ANI (@ANI) August 9, 2025