లక్నో, సెప్టెంబర్ 30: ఆస్కార్ అవార్డు గ్రహీత పింకీ సోంకర్ ఇంటి కూల్చివేతకు ఉత్తరప్రదేశ్ అటవీ అధికారులు నోటీసులు జారీచేశారు. ప్రభుత్వ స్థలాల్లో ఇండ్ల నిర్మాణం చేశారని ఆమెతోపాటు కొందరికి నోటీసులు అందజేశారు. ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్కు చెందిన పింకి సోంకర్ చీలిక పెదవితో(గ్రహణం మొర్రి) జన్మించారు. తన జీవితం ఆధారంగా తీసిన ‘స్మైల్ పింకీ’ డాక్యుమెంటరీకి 2008లో ఆస్కార్ అవార్డు లభించింది. పింకీ తన కుటుంబ సభ్యులతో కలిసి రాంపూర్ దాభి గ్రామంలో నివాసముంటున్నారు. మరో 30 మందికి అటవీ శాఖ అధికారుల నుంచి నోటీసులు అందాయి.