Save Democracy March | మార్చి 31న ఢిల్లీలో ప్రతిపక్షాల ‘సేవ్ డెమోక్రసీ’ ర్యాలీ
Save Democracy March | లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఈ నెల 31న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో మెగా మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ ప్రకటించింది. ‘సేవ్ డెమోక్రసీ’ నినాదంతో భారీ ర్యాలీ చేపడతామని ప్రతిపక్షాల నేతలు తెలిపారు.
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఈ నెల 31న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో మెగా మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ ప్రకటించింది.
‘సేవ్ డెమోక్రసీ’ నినాదంతో భారీ ర్యాలీ చేపడతామని ప్రతిపక్షాల నేతలు తెలిపారు. (Save Democracy March) ఆదివారం ఆప్ నేతలతో కలిసి కాంగ్రెస్, సీపీఎం నేతలు సంయుక్త నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. కేజ్రీవాల్ అరెస్ట్ తీరుపై ప్రజల్లో చాలా ఆగ్రహం ఉందని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. రాజకీయ నాయకులను భయపెట్టేందుకు, ప్రతిపక్షాలను నిర్మూలించేందుకు దర్యాప్తు సంస్థలను ప్రధాని మోదీ ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.
కాగా, ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ కూడా బీజేపీపై మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. ఎన్నికైన ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తున్నారని, పురాతన రాజకీయ పార్టీ ఖాతాలను స్వాధీనం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ‘ ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు మా నేత రాహుల్ గాంధీ యుద్ధం చేస్తున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ వెనక్కి తగ్గదు’ అని అన్నారు.
మరోవైపు మార్చి 31న ‘ఇండియా’ బ్లాక్‌కు చెందిన మిత్రపక్షాల నేతలు ఏకతాటిపైకి వస్తారని సీపీఎం నేత రాజీవ్ కున్వార్ తెలిపారు. ప్రజాస్వామ్యంపై దాడులను తాము సహించబోమని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SIR | తెలంగాణలో ఓట్ల తొలగింపు కలకలం.. 5.84 లక్షల ఫామ్-7 దరఖాస్తులు.. అసలేం జరుగుతోంది?
Alphabet Shares | రూ.45.76 లక్షల కోట్లు ఫట్… ఒక్కరోజే భారీగా కరిగిపోయిన గూగుల్ విలువ
Crypto Heist | క్రిప్టో చరిత్రలోనే అతిపెద్ద చోరీ.. 20 నిమిషాల్లో రూ.52వేల కోట్ల క్రిప్టో కరెన్సీ మాయం!!
Water Management | నీటి వృథాను అరికడితేనే.. కరువు నుంచి రక్షణ.. ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ బీవీ సుబ్బారావు
Krishna River | రోజుకో టీఎంసీ.. శ్రీశైలం నుంచి 79 రోజుల్లో 72 టీఎంసీలు ఎత్తిపోసిన ఏపీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

