లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడిన ఆయన సమాజ్‌వాదీ పార్టీతోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీలపై సెటైర్లు వేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడే మార్చి 10న యూపీలోని విపక్ష పార్టీలు తప్పంతా బీజేపీపైనే నిందలు వేస్తాయని విమర్శించారు. ప్రజలు బీజేపీ టీకా వేసుకున్నారని, అందుకే వారి వేలు కమలం గుర్తును నొక్కిందని ప్రతిపక్షాలు చెప్పబోతున్నాయని ఎద్దేవా చేశారు.
కాగా, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, సీఎం అభ్యర్థి అఖిలేష్ యాదవ్, తన సీటు గురించి అభద్రతా భావంతో ఉన్నారని ప్రధని మోదీ విమర్శించారు. అందుకే ఆయన పార్టీని చేజిక్కించుకుని ఘోరంగా అవమానించిన తండ్రి సహాయాన్ని కోరవలసి వచ్చిందని దుయ్యబట్టారు. అహ్మదాబాద్ బాంబ్ పేలుళ్ల నిందితులను కాపాడేందుకు అఖిలేష్ ప్రయత్నించారని ఆరోపించారు. అయితే దోషులకు కోర్టు తగిన శిక్ష విధించిందని అన్నారు.
#WATCH On March 10, when the election results will be announced, they (opposition) are going to say that "we lost because they (people) had taken BJP vaccine, hence their finger pressed the lotus symbol: Prime Minister Narendra Modi in Unnao, Uttar Pradesh pic.twitter.com/iKWv81mj2z
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 20, 2022