Parliament: అదానీపై జేపీసీ కోరుతూ.. పార్లమెంట్ ఫస్ట్ ఫ్లోర్‌పై విపక్షాల నిరసన
Parliament: అదానీపై జేపీసీ వేయండి.. ఆయన్ను అరెస్టు చేయండి.. అంటూ ఇవాళ విపక్షాలు పార్లమెంట్లో ఆందోళన చేపట్టాయి. బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్‌పై విపక్ష పార్టీలు నినాదాలు చేశాయి.
న్యూఢిల్లీ: పార్లమెంట్(Parliament)లో విపక్షాలు పట్టు వీడడం లేదు. అదానీ సంక్షోభం(Adani issue)పై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తూ.. ఉభయసభలను మళ్లీ స్తంభింపజేశాయి. ఇవాళ కూడా లోక్‌సభ, రాజ్యసభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. పార్లమెంట్ బిల్డింగ్‌లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్(first floor)పై విపక్ష ఎంపీలు నిరసన ప్రదర్శన చేపట్టారు. అదానీ అంశంపై జేపీసీ(JPC)తో దర్యాప్తు చేపట్టాలని నినాదాలు చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో భారీ బ్యానర్ కూడా కట్టారు. ఇక తృణమూల్ ఎంపీలు ప్రత్యేకంగా ఆందోళన చేపట్టారు. అదానీ అంశంపై ప్రధాని మోదీ తన మౌనాన్ని వీడాలని టీఎంసీ ఎంపీలు డిమాండ్ చేశారు.
Delhi | Opposition MPs protest on the first floor of the Parliament and demand a JPC inquiry into the Adani Group issue. pic.twitter.com/nbs2X6Nwtm
— ANI (@ANI) March 21, 2023
అదానీపై విచారణకు ఆదేశించకుండా ఆయనకు సహకరిస్తున్నట్లు కేంద్ర సర్కార్‌పై టీఎంసీ(TMC) ఆరోపణలు చేసింది. అదానీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, శివసేన, జేడీయూ, జేఎంఎం, ఐయూఎంఎల్, ఆప్, ఎండీఎంకే పార్టీలు ప్రతిపక్ష నేత ఖర్గే చాంబర్లో భేటీ అయ్యారు. మరోవైపు రాహుల్ గాంధీ(Rahul Gandhi) క్షమాపణలు చెప్పాలని కోరుతూ అధికార పక్షం డిమాండ్ చేస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

