న్యూఢిల్లీ: అదానీ అంశంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ ఢిల్లీలో ప్రతిపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. పార్లమెంటు నుంచి ఈడీ ఆఫీస్‌కు వారు ర్యాలీగా బయలుదేరారు. అదానీ-హిండెన్ బర్గ్ వ్యవహారంపై విచారణ చేయాలంటూ ఈడీకి మెమొరాండం సమర్పించేందుకు ఎంపీలు నిరసన ర్యాలీ చేపట్టారు. తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మినహా అన్ని ప్రతిపక్ష పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
అయితే, ఢిల్లీలోని విజయ్ చౌక్ దగ్గర ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. విజయ్ చౌక్ పరిసరాల్లో సెక్షన్ 144 అమల్లో ఉన్నందున అక్కడ ఏ ఆందోళనలను, నిరసనలను అనుమతించబోమని అదానీ అంశంపై ర్యాలీ చేపట్టిన విపక్ష ఎంపీలకు సమాచారం ఇచ్చారు. పార్లమెంట్ నుంచి ఈడీ ఆఫీస్‌కు ర్యాలీగా వెళ్తున్న ఎంపీలు విజయ్‌చౌక్ వైపు రాకుండా పోలీసులు ఈ ప్రకటన చేశారు.
కాగా, విపక్ష ఎంపీలు ర్యాలీలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. అదానీ అంశంపై విచారణ జరిపించాలని, అంతేగాక ఆ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రతిపక్ష ఎంపీల నిరసన ర్యాలీకి సంబంధించిన దృశ్యాలను కింది వీడియోల్లో చూడవచ్చు..
#WATCH | Delhi: Opposition MPs begin their march from Parliament to ED office to submit a memorandum over Adani issue. pic.twitter.com/AEMd2Zx0vJ
— ANI (@ANI) March 15, 2023
#WATCH | Delhi: Police make announcements at Vijay Chowk and inform the marching Opposition MPs to not march ahead as Section 144 CrPC is imposed and no agitation is allowed here.
The MPs are marching from Parliament to ED office. pic.twitter.com/cZ5FpIl6Zy
— ANI (@ANI) March 15, 2023