హైదరాబాద్ : ఒప్పో ప్రతిసారీ కెమెరాపై దృష్టి కేంద్రీకరిస్తుంది అలాగే, కాలానుగుణంగా వినియోగదారుని అనుభవాన్ని మార్చే పలు ఆవిష్కరణలను కొత్తగా అందుబాటులోకి తీసుకు వచ్చామని ఒప్పో ఇండియా వైస్ ప్రెసిడెంట్ అండ్ ఆర్&డీహెడ్ తస్లీమ్ ఆరిఫ్ అన్నారు. ఒప్పో ప్రత్యేకతలను గురించి ఆయన వెల్లడించారు. అదనంగా, కెమెరా ఒక ముఖ్యమైన అంశం కనుక, ఒప్పోలో మేము అపూర్వమైన ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ స్థాయిని చేరుకునేందుకు, మొబైల్ ఫోన్ హార్డ్‌వేర్ పరిమితులను అధిగమించే దిశలో భారీ పురోగతిని సాధిస్తున్నాము.
దీనికి సరైన ఉదాహరణ ఒప్పో రెనో సిరీస్ కాగా, ఇది వినియోగదారుడి అభిరుచులకు అనుగుణంగా దీనిని రూపొందించాం . ఈ ఏడాదిలో, మేము మా వినియోగదారుల కోసం ప్రయాణంలో స్మార్ట్‌ఫోన్‌ని మినీ స్టూడియోగా మార్చిన ఏఐ వీడియో హైలైట్, బొకే ఫ్లేర్ పోర్ట్రెయిట్ వీడియో తదితరాలను ఇండస్ట్రీ-ఫస్ట్ ఫీచర్లుగా ప్రవేశపెట్టాము.
వినియోగదారుని అవసరాలు ఎప్పటికప్పుడు మారుతూ, వృద్ధి చెందుతున్నాయి. నేడు చిన్న వీడియోలు ప్రపంచాన్ని ఆక్రమిస్తున్నాయి అలాగే, సోషల్ మీడియాలో తప్పనిసరిగా షేర్ చేయాల్సిన కంటెంట్‌గా ఫోటోలు ఉంటున్నాయి. ఈ ధోరణి మరింత పెరుగుతుందని భావిస్తుండగా, వీడియోకు చక్కని భవిష్యత్తు ఉండనుంది. మా రెనో సిరీస్ వినియోగదారులు ఒక నెలలోనే 200 మిలియన్లకు పైగా వీడియోలను సృష్టించడమే దీనికి నిదర్శనం. అదనంగా, సిఎంఆర్ నివేదిక ప్రకారం 5జి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత వీడియో కంటెంట్ సృష్టి కొత్త పోకడగా మారిందని తేటతెల్లం చేసింది.
వేగవంతంగా మారుతున్న ఈ పోకడలతో, మేము పోటీదారులు అందరికన్నా ముందంజలో ఉంటూ, మా వినియోగదారులందరి డిమాండ్లను పరిష్కరించాలని కోరుకుంటున్నాము. ఇప్పటివరకు, ప్రపంచంలో మారుతున్న పోకడలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లోని మా కేంద్రం అనేక భారత-కేంద్రీకృత ఆవిష్కరణలను తీసుకువచ్చింది. పూర్తిగా అంకితమైన కెమెరా ల్యాబ్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఇమేజింగ్ టెక్నాలజీ విభాగంలో మా నాయకత్వాన్ని మరింత మెరుగుపరచింది.
ఈ ల్యాబ్‌తో, ప్రజలు తమ ఫోన్లను వినియోగించే విధానంలో విప్లవాత్మక మార్పులు చేయడం అలాగే, మా అధునాతన కెమెరా సాంకేతికత ద్వారా వారి జీవితాలను రికార్డు చేయడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నాము. ఇమేజ్ మెరుగుదల కోసం కృత్రిమ మేధస్సును ప్రభావితం చేయడం , విభిన్న లైటింగ్ సందర్భాలలో వీడియోగ్రఫీని మెరుగుపరచేందుకు పరిష్కరణలు తదితర అత్యాధునిక సాంకేతికతను భారతదేశంలోని బృందం అభివృద్ధి చేస్తోంది. పోర్ట్రెయిట్ వీడియో ఫీచర్లలో అత్యంత పోటీతత్వంతో కూడిన సాఫ్ట్వేర్ ఫీచర్ల అభివృద్ధికి ఈ ప్రయోగశాల ప్రోత్సాహిస్తోందని ఒప్పో ఇండియా వైస్ ప్రెసిడెంట్ అండ్ ఆర్&డీహెడ్ తస్లీమ్ ఆరిఫ్ అన్నారు.