Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంది.. పాక్ దాడులు చేస్తే గట్టిగా జవాబిస్తాం : రాజ్‌నాథ్ సింగ్
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీరులోని(పీఓకే) ఉగ్రవాద స్థావరాలపై భారత సైనిక దళాలు జరిపిన దాడులలో 100 మంది ఉగ్రవాదులు మరణించారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం అఖిల పక్ష సమావేశంలో వెల్లడించారు. పాకిస్థాన్ దాడులు జరిపితే భారత్ తిప్పికొడుతుందని ఆయన సమావేశంలో ప్రకటించారు.
న్యూఢిల్లీ, మే 8: ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీరులోని(పీఓకే) ఉగ్రవాద స్థావరాలపై భారత సైనిక దళాలు జరిపిన దాడులలో 100 మంది ఉగ్రవాదులు మరణించారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం అఖిల పక్ష సమావేశంలో వెల్లడించారు. పాకిస్థాన్ దాడులు జరిపితే భారత్ తిప్పికొడుతుందని ఆయన సమావేశంలో ప్రకటించారు.
పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సైనిక చర్యను పూర్తిగా సమర్థించిన అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంగా అమలు చేసినందుకు సాయుధ దళాలను అభినందించారు. సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్, ఏఐఎంఐఎం, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, ఆప్, శివసేన(యూబీటీ), ఎల్జేపీతోసహా వివిధ రాజకీయ పార్టీల నాయకులు జాతీయ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారాన్ని అందచేస్తామని ప్రకటించారు. ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వానికి అండగా ఉంటామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమావేశం అనంతరం విలేకరుల వద్ద ప్రకటించారు.
ఇది చాలా సున్నితమైన సమయమని, దేశ ప్రయోజనాలకు సంబంధించిన సందర్భమని రక్షణ మంత్రి సమావేశంలో తెలిపారని, అందుకే తాము సవివరంగా ప్రశ్నలేమీ అడగలేదని ఖర్గే తెలిపారు. ‘ఆపరేషన్ సిందూర్‌లో కనీసం 100 మంది ఉగ్రవాదులు మరణించారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. వివరాల సేకరణ ఇంకా జరుగుతోంది. ఈ కారణంగా మరణాల సంఖ్యపై కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వలేకపోతున్నాము. పాకిస్థాన్ దాడులు చేస్తే భారత్ తగిన జవాబు ఇస్తుంది’ అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
సమావేశం సజావుగా సాగింది
అఖిలపక్ష సమావేశం సజావుగా జరిగిందని, సమావేశానికి హాజరైన నాయకులు పరిపక్వంగా వ్యవహరించడమేగాక ఏ విధమైన అభిప్రాయ భేదాలను బయటపెట్టలేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సమావేశం అనంతరం విలేకరులకు తెలిపారు. పాక్‌పై సైనిక దాడి విషయమై విస్తృతమైన రాజకీయ ఏకాభిప్రాయాన్ని తీసుకువచ్చేందుకు రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగినట్లు ఆయన చెప్పారు. తమ ఎదుట ఉన్న అంశం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సమావేశంలో నిర్మాణాత్మకంగా చర్చలు జరిగాయని ఆయన తెలిపారు. ఆపరేషన్ సిందూర్ గురించి రాజ్‌నాథ్ నాయకులందరికీ సమగ్రంగా వివరించారని, ప్రతి నాయకుడూ బాధ్యతతో, పరిపక్వతతో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారని రిజిజు చెప్పారు. ఇటువంటి క్లిష్ట సమయంలో రాజకీయాలకు తావు లేదని పార్టీలకు అతీతంగా నాయకులందరూ స్పష్టం చేశారని ఆయన చెప్పారు.
సంపూర్ణ సహకారం:విపక్షాలు
ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి ప్రభుత్వానికి తమ సంపూర్ణ సహకారాన్ని ప్రకటించినట్లు లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమావేశం అనంతరం విలేకరులకు తెలిపారు. ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్ని పంపేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని రాహుల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇండియా కూటమిలోని అన్ని పార్టీలతోపాటు ఇతర పార్టీలు కూడా ముక్త కంఠంతో ప్రభుత్వానికి, సాయుధ దళాలకు అండగా ఉంటామని ప్రకటించాయని రాహుల్ తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ సమావేశంలో పాల్గొనకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు సాయుధ దళాలకు, ప్రభుత్వానికి అభినందనలు తెలియచేసినట్లు ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అఖిలపక్ష సమావేశం అనంతరం విలేకరులకు తెలిపారు.
పహల్గాం ఉగ్రదాడికి బాధ్యత వహించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)కి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా ప్రచారం చేపట్టాలని ఆయన సూచించారు. టీఆర్ఎఫ్ని ఉగ్రవాద సంస్థగా ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి ప్రకటించాలని ఆయన కోరారు. టీఆర్ఎఫ్ని విదేశీ ఉగ్ర సంస్థగా అమెరికా తన దేశంలో ప్రకటించాలని కూడా అమెరికా ప్రభుత్వాన్ని కోరాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

